ఒకప్పుడు సరైన సమయంలో వర్షాలు కురియక రైతులు ఆందోళన చెందేవారు. ఒక్కోసారి అతి వర్షాలు కురిసి పంటకు నష్ట వాటిల్లేది. ఇలాంటి సంఘటనలను ఎదుర్కొన్న రైతులు ఎప్పుడూ వినని మాటలు రాజకీయ నాయకుల నోటి నుంచి వింటున్నారు. ఆ మాటలతో ఏం చేయాలో రైతులకు పాలుపోవడం లేదు. ఓ రాజకీయ పార్టీ అధినేత వరి వేస్తే ఊరే అంటే.. మరో రాజకీయ పార్టీ నేత వరి వేయండి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి కొనిపిస్తానంటున్నారు.. ఇలా రాజకీయ…
కేసీఆర్‌ది రెండు నాల్కల ధోరణి అంటూ సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేసీఆర్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నల్లగొండలో ఆయన మాట్లాడుతూ..హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమితో.. కేసీఆర్‌లో అసహనం పెరిగిపోయిందన్నారు. బీజే పీ, టీఆర్‌ఎస్‌పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని, బీజేపీతో టీఆర్ ఎస్ లాలూచీ పడిందన్నారు. రైతాంగం దివాలా తీసిన తర్వాత కేసీ ఆర్ ఢిల్లీ పోతాడా..? ఢిల్లీ వెళ్లి నిరాహారదీక్షపై స్పష్టత లేదు. మీరు, మేం కలిసి ధర్నా చేద్దాం రండి…
వడ్ల సేకరణ విషయంలో కేంద్రానిది ఘోర వైఫల్యమని, పంజాబ్ మాదిరిగా తెలంగాణ వడ్లు కేంద్రం ఎందుకు కొనదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగి వడ్ల సేకరణ విషయంలో కేంద్రానికి స్పష్టత లేదన్నారు. యాసంగి వడ్లను బాయిల్డ్ రైస్ కోసం ఇప్పటి వరకు కేంద్రం ప్రోత్సహించి ఇప్పుడు చేతులెత్తే సిందన్నారు. కేంద్రం బాయిల్డ్ రైస్‌కు ప్రోత్సామం ఇచ్చినందునే దేశంలో ఎన్నో మిల్లులు ఏర్పడ్డాయన్నారు. ఏడేళ్లుగా…
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో తేల్చుకోవడానికి సిద్ధం అవుతున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.. అందులోభాగంగా కేంద్రంపై యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. ప్రగతి భవన్‌లో ఇవాళ మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో తేల్చుకుంటామన్నారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఆయన.. తెలంగాణలో 3 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెబుతున్నారు.. ఇది నీ చేతకాని తనం కాదా? అంటూ ఫైర్ అయ్యారు. ఇక, కేంద్రం వరి…
ఉమ్మడి నిజామాబాద్‌లో రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రైతులు పడిగాపులు పడుతున్నారు. కోత పూర్తి చేసి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన తర్వాత వారికి అసలు కష్టాలు ఎదురవుతున్నాయి. కేంద్రాల్లో నిబంధనలకు అనుగు ణంగా 17శాతంలోపు ఉంటే తప్ప కాంటా వేయడం లేదు. ఒక వేళ తేమ శాతం వచ్చినా తమ తమ వంతు వచ్చే వరకు ఎదురు చూడక తప్పడం లేదు. ఈ రెండు దాటుకుని ముందుకు వస్తే అప్పటికే కాంటాబస్తాలతో…
రాజధానిగా అమరావతిని అమలుచేయాలంటూ రైతులు, ప్రజాసంఘాలు చేపట్టిన పాదయాత్రకు కోర్టు అనుమతిచ్చినా పోలీసులు మాత్రం ఆంక్షలు విధిస్తున్నారు. విచ్చలవిడిగా రోడ్లపై రచ్చ చేసే వైసీపీ వాళ్లకు అడ్డురాని కోవిడ్ నిబంధనలు, లౌడ్ స్పీకర్లు రైతుల మహా పాదయాత్రకే అడ్డొచ్చాయా డీజీపీ గారు అంటూ మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్. వైసీపీ ర్యాలీలకు రెడ్ కార్పెట్ వేస్తున్న పోలీసులు అమరావతి రైతుల మహా పాదయాత్రకు అడ్డంకులు కల్పిస్తూ నోటీసులిస్తున్నారు. అమరావతిని చంపేసి ఉద్యమాన్ని అణిచేయాలనే…
ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర చేపట్టారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో రైతుల యాత్ర సాగిస్తున్నారు. ఈ యాత్ర ఇవాళ ఆరో రోజు కొనసాగుతోంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా చేస్తున్న యాత్ర పెదనందిపాడులో ప్రారంభమై 14 కి.మీ మేర సాగి ఇవాళ పర్చూరులో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా పర్చూరు వై జంక్షన్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు, పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు…
రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతుల ప్రాణాలు పోతున్న పట్టించుకోవడం లేదు.ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో నిండు ప్రాణం బలి అయింది. తాజాగా ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ఓ రైతు మృతికి కారణమైంది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఐలాపూర్ గ్రామానికి చెందిన రైతు బీరయ్య(57) గుండె పోటుతో మృతి చెందాడు. తన ధాన్యం కుప్ప వద్ద కాపలా కోసం వచ్చిన రైతు బీరయ్య అక్కడే నిద్రించాడు. అర్ధరాత్రి గుండెపోటు…
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బృందం కెనడాకు చేరుకుంది. ఈ బృందం SFJ, ఖలిస్థాన్, సిక్కు ఫర్ జస్టిస్ (SFJ) వంటి సంస్థలకు మద్దతూనిస్తూ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే సంస్థలకు వస్తున్న నిధులు, వాటిని సమకూరుస్తున్న వివిధ సంస్థలు (NGO) పై ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. దీన్లో భాగంగానే శుక్రవారం NIA బృందం కెనడాకు చేరుకుంది. నాలుగు రోజుల పర్యటనలో విదేశీ సంస్థలతో ఈ వేర్పాటువాద సంస్థల సంబంధాలపై ముగ్గురు సభ్యుల NIA బృం దం దర్యాప్తు చేస్తుందని…
విజయనగరం జిల్లా లచ్చయ్య పేట ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం వద్ద బకాయిల కోసం నెల రోజులుగా దీక్ష చేస్తున్న, ప్రభుత్వం పట్టించు కోకపోవడంతోనే ఆందోళ ఎక్కువైందని జనసేన అధినేత పవన్ కళ్యా ణ్ అన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత రెండేళ్ల లో ఆ కర్మాగారం నుంచి రైతులకు రావాల్సిన రూ.16.38 కోట్ల బకా యిలను ఇప్పించేలా చూడాల్సిన పాలనా యంత్రాంగం ఈ సమస్య ను శాంతి భద్రతల సమస్యగా చూడటం సరైంది కాదన్నారు.…