కేసీఆర్‌ది రెండు నాల్కల ధోరణి అంటూ సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేసీఆర్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నల్లగొండలో ఆయన మాట్లాడుతూ..హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమితో.. కేసీఆర్‌లో అసహనం పెరిగిపోయిందన్నారు. బీజే పీ, టీఆర్‌ఎస్‌పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని, బీజేపీతో టీఆర్ ఎస్ లాలూచీ పడిందన్నారు. రైతాంగం దివాలా తీసిన తర్వాత కేసీ ఆర్ ఢిల్లీ పోతాడా..? ఢిల్లీ వెళ్లి నిరాహారదీక్షపై స్పష్టత లేదు. మీరు, మేం కలిసి ధర్నా చేద్దాం రండి అంటూ టీఆర్‌ఎస్‌ను ఉద్దేశిం చి అన్నారు. పార్లమెంట్‌లో.. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసిన బిల్లులు అన్నింటికి బీజేపీకి మద్దతూ ఇచ్చింది నిజం కాదా అంటూ తమ్మినేని టీఆర్‌ఎస్‌ను నేతలను విమర్శించారు. దేశ రైతాంగం వర్సెస్ బీజేపీ పోరాటం జరుగుతుందని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు పై టీఆర్‌ఎస్‌తో సం బంధం లేకుండా ఈ నెల 12న సీపీఎం శ్రేణులు ధర్నా చేయా లని తమ్మినేని పిలుపునిచ్చారు. పోడు భూముల విషయంలో.. 2013 ముందు సాగులో ఉన్న వారందరికీ భూ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పోడు భూములపై చట్టానుసారం వ్యవ హరించాలన్నారు. చట్టంలో 25 సెక్షన్‌లను పక్కనపెట్టి.. కేవలం శాటిలైట్ ఫోటోల ప్రతిపాదికన పోడు భూములపై వ్యవహరించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో వరి, గోధుమ పంటల సాగు నిలిపేయాలనే కుట్ర జరుగుతోందని, అమెరికా ఆహార ఉత్ప త్తులను ఇక్కడ అమ్మాలనే కుట్రలు జరుగుతున్నాయని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఎలాగైనా దీన్ని అడ్డుకోవాలని ఆయన సీపీఎం శ్రేణులకు పిలుపునిచ్చారు.