టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ.. అయోమయంలో తెలంగాణ రైతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు సరైన సమయంలో వర్షాలు కురియక రైతులు ఆందోళన చెందేవారు. ఒక్కోసారి అతి వర్షాలు కురిసి పంటకు నష్ట వాటిల్లేది. ఇలాంటి సంఘటనలను ఎదుర్కొన్న రైతులు ఎప్పుడూ వినని మాటలు రాజకీయ నాయకుల నోటి నుంచి వింటున్నారు. ఆ మాటలతో ఏం చేయాలో రైతులకు పాలుపోవడం లేదు. ఓ రాజకీయ పార్టీ అధినేత వరి వేస్తే ఊరే అంటే.. మరో రాజకీయ పార్టీ నేత వరి వేయండి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి కొనిపిస్తానంటున్నారు.. ఇలా రాజకీయ పార్టీల నాయకులు సందేశాలతో తెలంగాణాలోని రైతులు అయోమయంలో పడిపోయారు.
అసలు విషయం ఏంటంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే యాసంగిలో వరి వేయకండి.. అలా వేస్తే మేము వరి ధాన్యం కొనుగోలు చేయం.. అని ఖరాఖండిగా చెప్పారు. కేసీఆర్ మాటలపై స్పందించిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రైతులు వరి వేయండి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేసేలా చేస్తామంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయమంటోంది.. అందుకే మీరు వరి వేయకండని సీఎం కేసీఆర్ అంటుంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి చెందిన నాయకుడు వరి వేయండి మేము కొనుగోల్లు చేపిస్తామంటూ చేసే వాగ్దానాలపై ఎవరి మాటలు నమ్మాలో రైతులకు ఆర్థం కావడం లేదు. ఇప్పటికే వానాకాలంలో వరి ధాన్యం కొనుగోల్లు ఆలస్యమవుతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
వానాకాలంలో పండించిన ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలంగాణ సర్కార్ హామీ ఇచ్చినా.. యాసంగిలో వేయాల్సిన పంటలపై క్లారిటీ రాకపోవడంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. ‘దున్నపోతు..దున్నపోతు.. పోట్లాడుకుంటే లేగదూడ కాలు విరిగినట్లు’ రాజకీయ పార్టీలు వారి లబ్దికోసం రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారనే భావన కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా రైతులు వచ్చే యాసంగిలో వరి మినహా వేరే పంటలు వేసుకోవాలని సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించి మరీ ఓ క్లారిటీ అయితే ఇచ్చారు… కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న.. బీజేపీ నేత బండి కేంద్రంతో వరి ధాన్యం కొనుగోలు చేయిస్తారా.. చూడాలి మరి.
తాజావార్తలు
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!