రేపు టీఆర్‌స్ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం 4గంటలకు శాసనసభ పక్షం భేటీ కానుంది. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రప్రభుత్వ తీరుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీరు, రాష్ర్ట బీజేపీ మరో విధంగా వ్యవహరిస్తుందని.. దీంతో రైతులు అయోమయా నికి గురవుతున్నారని టీఆర్‌ఎస్ ఆరోపిస్తుంది. ఇప్పటికే ధర్నాలకు సైతం పిలుపునిచ్చింది. దీనిపై టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో భవి ష్యత్ కార్యచరణను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ వైఖరి, బీజేపీ…
శాంతి భద్రతలను కాపాడటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్‌ఎస్ గుండాల దాడిలో బీజేపీ నేతల వాహనాలు ధ్వంసం అయ్యాయన్నారు. దాడి అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పై నిప్పులు చెరిగారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులను బెదిరించడమేంటని ఆయన మండి పడ్డారు. సీఎం డైరెక్షన్‌లోనే దాడులకు కుట్ర జరిగిందన్నారు. ప్రతి పక్ష పార్టీ అధ్యక్షుడిగా రైతులను కలిసేందుకు వస్తుంటే టీఆర్ఎస్ నేతలకు ఎందుకింత అసహనం వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. మీ అసలు బండారం…
తెలంగాణలో ప్రస్తుతం పంట కొనుగోళ్లపై సమస్య నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రాష్టంలో వర్షాకాలం పంట కొనుగోళ్లు చెప్పటింది తెలంగాణ ప్రభుత్వం. కానీ సకాలంలో పంట అమ్ముడు పోకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమస్యపై వీణవంక మండలంలో రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీణవంక మండలం రెడ్డిపల్లెలో సమయానికి బర్ధన్ ఇవ్వకుండ ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వర్ష సూచనలు ఎక్కువగా ఉండటంతో… పంట తడిసిపోతుంది…
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు వ్యవహారం రాజకీయపార్టీల మధ్య యుద్ధంగా మారుతోంది. పరస్పరం విమర్శలతో రాజకీయం వేడెక్కుతోంది. వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకే సిద్ధమైంది బీజేపీ. ఇవాళ, రేపు నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10.30 కి నల్గొండ కి చేరుకోనున్నారు బండి సంజయ్. చర్లపల్లి బైపాస్ వద్ద ఘన స్వాగతం బీజేపీ శ్రేణులు స్వాగతం పలకనున్నాయి. అనంతరం ఆర్జాలబావి…
ప్రభుత్వం.. పార్టీల మధ్య పోరాటం కాదు.. ఇది ప్రభుత్వాల మధ్య యుద్ధం.. రైతు పండించిన పంట కల్లాలు, మార్కెట్ యార్డ్లు, చివరకు రోడ్లపై కూడా ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తుంది.. కానీ, గిట్టుబాటు ధర చెల్లించి రైతు నుంచి పంటను కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వాలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి… పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.. మొత్తం వడ్ల చుట్టే తిరుగుతోంది రాజకీయం… వడ్ల పండించాలని ఒకరు, పండించవద్దని మరొకరు.. ఇలా రైతులను గందరగోళంలోకి నెట్టేస్తున్నారు.. వడ్లను రాష్ట్ర ప్రభుత్వం కొనాలని కేంద్రంలో…
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ్టికి పన్నెండవ రోజు ప్రకాశం జిల్లా ఒంగోలుకు చేరింది. రైతులు తలపెట్టిన పాదయాత్రకు ఒంగోలు నగరంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అమరావతి రైతులకు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్, జనసేన,సీపీఐ, సీపీఎం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆనాడు అమరావతిని శాశ్వత రాజధానిగా ఉంచుతామనే హామీవల్లే తమ విలువైన భూములు ఇచ్చామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు మూడు…
టీఆర్ఎస్ ధర్నాలు చేయాల్సింది రాష్ర్టంలో కాదని ఢీల్లీలోని జంతర్మంతర్ వద్ద చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిన బీజే పీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో మాత్రం ధర్నాలు చేయడం సిగ్గు చేటన్నారు. ముందు వడ్లు కొనుగోలు చేయడానికి రాష్ట్ర బీజేపీ నాయ కులు కేంద్రం పై ఒత్తిడి పెంచాలని ఆయన కోరారు. రాష్ట్రంలో బీజే పీ,…
న్యాయస్థానం టు దేవస్థానం అని ఒక ముసుగు వేసుకుని అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని వారు ఇకనైనా కళ్లు తెరవాలని వైసీ ఎమ్మెల్యే సుధాకర్బాబు అన్నారు. 157 మంది మాత్రమే పాల్గొంటా మని జాబితా ఇచ్చి కోర్టు నుంచి అనుమతి పొందారని, ఇప్పుడేమో చంద్రబాబు సంఘీభావం పేరుతో రాష్ట్రంలో అలజడికి కుట్రలు పన్నుతున్నడని ఆయన అన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరిగింది. రాజధాని రైతులకు ప్యాకేజీ అందిం దని,ఏడాదికి ఒకసారి కౌలు డబ్బులు, ఇతర…
అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర కొనసాగుతోంది… అయితే, ఈ పాదయాత్రలో పాల్గొనకుండా.. టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తూ వస్తున్నారు పోలీసులు.. ఇక, ఈ ఘటనపై సీరియస్గా స్పందించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. రైతుల మహాపాదయాత్రకు వస్తున్న స్పందన చూసి జగన్కు చలి జ్వరం పట్టుకుందని వ్యాఖ్యానించిన ఆయన.. మహాపాదయాత్ర రాజకీయ యాత్ర కాదు.. భావితరాల భవిష్యత్ యాత్రగా అభివర్ణించారు.. రాజధాని మార్పుపై ఇచ్చిన మాటను తప్పినందుకు జగన్ సహా వైసీపీ నేతలందరూ…
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహదుల్లో సుదీర్ఘంగా తమ పోరాటానికి కొనసాగిస్తూనే ఉన్నారు రైతులు.. కొత్త కొత్త తరహాలో ఎప్పటికప్పుడూ తమ నిరసనలను తెలియజేస్తూ వస్తున్నారు.. ఇక, ఢిల్లీలో మరోసారి భారీ ట్రాక్టర్ల ర్యాలీకి సిద్ధం అవుతున్నారు.. ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల నిరసనలు పతాకస్ధాయికి చేరాయి. రైతుల నిరసనలు చేపట్టి ఏడాది పూర్తవడంతో ఆందోళనలను ముమ్మరం చేయాలని నిర్ణయించిన రైతు సంఘాలు.. ఈ నెల 26న 500…