కేసీఆర్ రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నారు: విజయశాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఏమిటని ప్రశ్నించే ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతులు పండించే వరిని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. గతంలో రైతులు పండించిన ప్రతి గింజా కొంటామని… కోటి ఎకరాల్లో సాగునీటి కోసమే కాళేశ్వరం తదితర సాగునీటి ప్రాజెక్టులున్నాయని… తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని గప్పాలు కొట్టిన కేసీఆర్ .. నేడు రైతుల పై రెండు నాల్కల ధోరణి అవలంభిస్తూ కేంద్ర విధానా లను అనాలోచితంగా తప్పుబడుతున్నారన్నారు. అనవసరంగా ధర్నాలు చేస్తామనడం హస్యాస్పందగా ఉందన్నారు.
పారాబాయిల్డ్ రైస్ విషయంలో తప్ప… రా రైస్ కొనబోమని ఏ రోజూ కేంద్ర ప్రభుత్వం గానీ, ఎఫ్‌సీఐ గానీ చెప్పలేదు. రా రైస్ కోసం రైస్ మిల్లర్లను సిద్ధం చేయించాల్సిన రాష్ట్ర సర్కార్… యాసంగిలో రైతులు అసలు వరి వేయవద్దంటూనే, వానాకాలం వడ్లు కల్లాలలో పోసి నెల దాటినా కొనకుండా తాత్సారం చేస్తుందన్నారు. వర్షాలకు తడిసి ధాన్యం పాడవుతున్నా కొనుగోళ్లు వేగవంతం చేయకుండా యాసంగి వడ్ల కొనుగోలుపై మళ్ళీ ధర్నా పేరుతో డ్రామాలు మొదలెడుతోందని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న ధాన్యం కొను గోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్న బాధలను తెలుసుకో వడానికి వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పైన, బీజేపీ కార్యకర్తలపైన టీఆర్ఎస్ గుండాలతో దాడి చేయించడం సిగ్గుచేటన్నారు.
Also Read
రైతు సమస్యలు ఎలాగూ పట్టని తెలంగాణ రాష్ట్ర సర్కార్… కేరళ, తమిళనాడు సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో నిల్వలుండి… అరోగ్యం విషయంలో సైతం భిన్నాభిప్రాయాలున్న పారాబాయిల్డ్ , స్టీమ్ రైస్‌ను అడ్డుకోకుండా కేంద్రం చూస్తోందన్నారు. హుజూరాబాద్‌లో ఓటమి నైరాశ్యంతో, అనవసరంగా కేంద్రాన్ని బద్నాం చేయాలనే దురుద్దేశంతోనే రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె విమర్శించారు. దళారులతో సిండికేట్‌గా మారి అఫీషియల్‌గా బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతూ నీచ రాజకీయాలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు పతనం తప్పదన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రైతాంగం కేసీఆర్‌కు ఖచ్చితంగా బద్ధి చెబుతారని విజయశాంతి వ్యాఖ్యానించారు.
- Tags
- bjp
- Farmers
- kcr
- TRS
- Vijayashanti
తాజావార్తలు
-
TDP vs YCP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి!
-
Punam Raut Retires: “చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా”.. రిటైర్మెంట్ ప్రకటనపై పూనమ్ భావోద్వేగం..
-
Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
Parliament Special Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ప్లాన్?.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కసరత్తు
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!