తెలంగాణలో ప్రస్తుతం పంట కొనుగోళ్లపై సమస్య నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రాష్టంలో వర్షాకాలం పంట కొనుగోళ్లు చెప్పటింది తెలంగాణ ప్రభుత్వం. కానీ సకాలంలో పంట అమ్ముడు పోకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమస్యపై వీణవంక మండలంలో రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీణవంక మండలం రెడ్డిపల్లెలో సమయానికి బర్ధన్ ఇవ్వకుండ ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వర్ష సూచనలు ఎక్కువగా ఉండటంతో… పంట తడిసిపోతుంది ఏమోనని భాదపడుతున్నారు రైతులు. అలాగే కొనుగోలు చేస్తున్న పంటకు వాహనాలను ఏర్పాటు చేయకుండా… తమనే ట్రాక్టర్లు, వ్యాన్ లను పెట్టుకోమంటున్నారు అని రైతులు తెలుపుతున్నారు. అలాగే తూకం విషయంలో కూడా అవకతవకలు చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. ఇన్ని జరుగుతున్న కానీ… సంబంధిత అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు అని అంటున్నారు స్థానికులు.