కేంద్రంలో మధర్ థెరిస్సా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు ఎస్ మండలంలో రూ.20లక్షల వ్యయంతో నిర్మించిన రైతు ఉత్పత్తిదారుల సంఘం నూతన భవనాన్ని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు సదస్సులో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. సమృష్టి వ్యవసాయ అభివృద్ధిపై రైతాంగం దృష్టి సారించాలని సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం వ్యవసాయానికి అవసరమైన నీరు, విద్యుత్‌ను సమృద్ధిగా అందుబాటులో ఉంచిందన్నారు. రైతాంగం అధిక…
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు త్వరలోనే మీటర్లు ఏర్పాటుచేస్తామన్న ఏపీ ప్రభుత్వ ప్రకటనలతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2020 డిసెంబరు నుండి రైతుల బోర్లకు విద్యుత్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కావటంతో భవిష్యత్‌లో ఏం జరుగుతుందోనని రైతాంగంలో చర్చ మొదలైంది. మీటర్ల ఏర్పాటుకు అంగీకార పత్రాలపై రైతులు సంతకాలు చేయకుంటే ఉన్న కనెక్షన్లు తొలగిస్తామని పలు చోట్ల విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసి సంతకాలు చేయించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలోని ఏడు…
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ప్రస్తుతం ఏపీలోని రైతులు, కౌలు రైతుల పరిస్థితి తయారైంది. ఆరుగాలం శ్రమించి పట్టెడన్నం పెట్టే రైతన్నను అకాల వర్షాలు, ఈదురు గాలులు దెబ్బతీస్తున్నాయి. అసని తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలతో తడిసి ముద్దైన ధ్యానం, పంట చేతికి వచ్చిన తరుణంలో నేలనంటిన వరి చేలు అన్నదాతలను కన్నీరు పెట్టిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో అకాల వర్షాలు, ఈదురు గాలులు రైతులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షాలు కురుస్తుండటంతో…
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నగదును కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో ఏడాదికి మూడు సార్లు జమ చేస్తుంది. ప్రతి రైతుకు రూ.2వేల చొప్పున ఏడాదికి మూడు సార్లు రూ.6వేల నగదును కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అయితే ఈ పథకం అమలులో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా గతంలో కేవైసీ చేసుకున్న ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ–కేవైసీ పూర్తి చేసిన వారి ఖాతాల్లోఏ…
వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు డిక్లరేషన్ పైనా వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి రైతుల సంక్షేమం పట్ల చిత్తశుద్ది లేదన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ అని వాళ్ల పార్టీ వాళ్లే అంటున్నారని అన్నారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ దొంగని పార్టీ చీఫ్ గా పెడితే ప్రజలు నమ్మరని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. వరంగల్ సభలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముందు…
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మైన సమస్య వడ్లు కొనుగోళ్లని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పంట పండించడం కంటే వాటిని అమ్మడం పెద్ద సమస్యగా మారిందని పేర్కొన్నారు. రైతులు తాము వడ్లు అమ్ముకోగలం అన్న నమ్మకం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరి వేసిన రైతులు ఈ 6 నెలలు బిక్కు బిక్కుమంటూ బతికారని అన్నారు. రైతుల పక్షాన పోరాటం చేయడానికి నెల రోజులుగా ”రైతుగోస” పేరుతో సమస్యలను ప్రస్తావించినా సీఎం స్పందిచలేదని…
మండువేసవిలో వర్షం పడితే బాగానే వుంటుంది. కానీ ఆ వర్షం బీభత్సంగా మారితే నష్టం తీవ్రత చాలా ఎక్కువగా వుంటుంది. నెల్లూరు జిల్లాలో అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని కలిగించాయి. మెట్ట ప్రాంతంలో కోతకు వచ్చిన పంట నేలకొరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు కళ్ళ ముందే నేల కొరగడంతో రైతులు ఆవేదన అంతా ఇంతా కాదు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, వరికుంటపాడు, ఆత్మకూరు, డక్కిలి, వెంకటగిరి ప్రాంతాల్లోఉరుములు..మెరుపులు. ఈదురు…
ఆంధ్రప్రదేశ్-ఒడిశా మధ్య కోడి గుడ్ల వివాదం ఇంకా చల్లారలేదు. ఒడిశాలోని కుర్ధా రోడ్ వద్ద ఏపీకి చెందిన కోడిగుడ్ల లారీలను ఒడిశా పౌల్ర్టీ రైతులు, ట్రేడర్స్ అడ్డుకున్నారు. సుమారు రెండు వందల కోడిగుడ్ల లారీలు జాతీయరహాదారిపై నిలచిపోయాయి. ఏపీ ఎగ్ ట్రేడర్స్ తో చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. ఎండ వేడికి గుడ్లు పాడవుతాయని ఆంధ్ర రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేతల ధరలు పెరుగుతుండటం, గుడ్డు ధర పెరగకపోవడంతో ఒడిశా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రల…
ఏపీ సీఎం వైఎస్ జగన్పై మరోసారి విరుచుకుపడ్డారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. సీబీఐ దత్తపుత్రుడు పాలన చేస్తున్నారా..? వడ్డీ వ్యాపారం చేస్తున్నారా..? అని ఫైర్ అయిన ఆయన.. రైతుల నుంచి నీటి తీరువాను వడ్డీ విధించి వసూలు చేస్తున్నారు.. అసలే, గిట్టుబాటు ధరలు రాక.. పండిన పంట చేతికొస్తుందో లేదో అర్థం కాని పరిస్థితుల్లో రైతుల నుంచి వడ్డీలు వసూలు చేస్తారా? 2018 నుంచి నీటి తీరువా లెక్కగట్టి 6 శాతం వడ్డీతో రైతుల…