సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనుగోలు చేసిన రైస్ మిల్లర్లు.. ఆ తర్వాత వాటిని మిల్లులకు తీసుకెళ్లడం లేదు.. లారీల కొరత వల్లే ఈ సమస్య తలెత్తింది. దీంతో తమ పంటను అమ్ముకున్నా.. కొనుగోలు కేంద్రాల్లోనే నిల్వ ఉంచే పరిస్థితి నెలకొందని రైతులు బాధపడుతున్నారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ రెజ్లర్లు చేపట్టిన ఆందోళనకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. తాజాగా రెజ్లర్ల ఆందోళనకు మద్దతుగా రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా నేతలు ఆదివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌కు వచ్చారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై నిరసనలో అగ్రశ్రేణి రెజ్లర్‌లతో చేరిన రైతులు ఆదివారం కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.
Kakani Govardhan Reddy: చంద్రబాబు పర్యటనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని.. రైతులను అడ్డం పెట్టుకుని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. పంటలు నష్టానికి సంబంధించి ప్రభుత్వం రెండు జీవోలను జారీ చేసింది.. వాటి గురించి చంద్రబాబుకు తెలియదు అని ఎద్దేవా చేశారు. రైతుల బీమాకు సంబంధించి ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది.. చంద్రబాబు హయాంలో ఏ ఏ రైతు ప్రీమియం…
రైతులకు పూర్తిస్థాయిలో అండగా నిలవాలని ఆదేశించారు సీఎం జగన్. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల్లో ఏ ఒక్కరికీ పరిహారం అందలేదన్న మాట రాకూడదన్న ఆయన.. పంట సహా ఇతర నష్టాలకు గ్రామ సచివాలయాల స్థాయి నుంచే వివరాలు తెప్పించుకోవాలన్నారు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.. ఇది పూర్తి స్థాయిలో జరగాలని ఆదేశాలు జారీ చేశారు.
అకాల వర్షాలతో కుదేలైన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం నష్టాల పాలైందన్న ఆయన.. ప్రాథమిక అంచనా మేరకు 3 లక్షల ఎకరాలలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయి. వరి, మామిడి, మొక్కజొన్న, అరటి, మిరప రైతులు ఆవేదనలో ఉన్నారు. బాధిత రైతులకు అండగా నిలిచి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు..
తెలంగాణలో అకాల వర్షాలు, వడగండ్ల వానలతో వరి పంటలకు నష్టం వాటిల్లింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట రక్షణ కోసం పడ్డ కష్టమంతా గాలివాన, వడగండ్ల మూలంగా నేలపాలైందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మ జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించి రైతులు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. రైతు బంధు ఇస్తున్నా.. అనే సాకు చూపించి అరకొర రైతుబంధు ఇచ్చి రైతులకు ఏదో మేలు చేస్తున్నాను అని చేప్తున్న కేసీఆర్ కి ఆకాల వర్షంతో నష్టపోయిన రైతుల కష్టాలు కనపడుతున్నాయా? లేదా? అంటూ ప్రశ్నించారు.
శ్చిమ బెంగాల్‌లోని ఐదు జిల్లాల్లో గురువారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ప్రకృతి ప్రకోపానికి రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొరోజులో డజనుకుపైగా మంది బలయ్యారు. రాష్ట్రంలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. పిడుగుల కారణంగా కనీసం 14 మంది మరణించారని అధికారులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు కురవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలు కన్నీరుమున్నీరయ్యారు. చేతికి వచ్చిన పంట వర్షాలకు దెబ్బతినడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి లేఖ రాశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని.. పిడుగుపాటుతో మరణించిన రైతు కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.. మార్చిలో కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్న ఆయన.. మరోవైపు.. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలతో చేతికొచ్చే పంట నేలపాలైంది.. కృష్ణా, గుంటూరు, గోదావరి డెల్టా ప్రాంతాల్లో భారీగా వరిపంట…