పథకాల ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ఉద్దేశించిన మొత్తం రూ.3.70 లక్షల కోట్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా బుధవారం ఇక్కడ తెలిపారు.
తెలంగాణ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 26 నుంచి రైతు బంధు నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వానాకాలం పంట పెట్టుబడి కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. రాష్ట్ర రైతాంగానికి ఎప్పటిలాగే నేరుగా వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని.. అందుకు చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖామంత్రి హరీష్ రావును అదనపు ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు.
హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో రైతులు పొద్దుతిరుగుడు విత్తనాలపై కనీస మద్దతు ధర అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత నిరసనను విరమించుకున్నారు. పొద్దుతిరుగుడు విత్తనాలపై కనీస మద్దతు ధర (ఎంఎస్పి) డిమాండ్ను నెరవేర్చడానికి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం అంగీకరించడంతో రైతులు మంగళవారం తమ నిరసనను ముగించారు.
Rythubandhu Funds: తెలంగాణలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పథకాల అమలులో ప్రభుత్వం వేగం పెంచింది. ఇప్పటికే రెండో విడత గొర్రెలను పంపిణీ చేశారు.
MLA Kandala: అమ్మిన వడ్లకు డబ్బులు ఇవ్వడంలేదంటూ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిని రైతులు ప్రశ్నించారు. దీంతో రైతు దినోత్సవం కాస్త రసాభసగా మారింది. రైతుల ప్రశ్నలకు కందాల సమాధానం చెప్పలేక పోయారు.
Errabelli Dayakar: రైతును రాజును చేసిందే సీఎం కేసీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ్ అన్నారు. వరంగల్ జిల్లా తెలాంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో రైతు దినోత్సవ వేడుకలను మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు.
లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్న రెజ్లర్లకు మద్ధతుగా రేపు రైతులు పెద్ద సంఖ్యలో సమావేశం నిర్వహించనున్నారు. ఉత్తర్ప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలోని సౌరం పట్టణంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Formers: తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు తడిసిపోయాయి. సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.