Farming with alcohol: మద్యం ఆరోగ్యానికి హానికరం, అతిగా తాగితే పైకిపోవడమే. అయితే మద్యం పంటకలు మంచిదే అంటున్నారు మధ్యప్రదేశ్ రైతులు. పంటల్లో చీడపీడలను అరికట్టేందుకు దేశీ లిక్కర్ వాడుతున్నారు. దీంతో ఫలితాలు బాగుంటున్నాయని చెబుతున్నారు. పెరుగుతున్న పురుగుమందుల ధరలకు ఇది పరిష్కారం అంటున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్మదాపురం జిల్లా రైతులు ఇలా వినూత్నంగా వ్యవసాయం చేస్తూ.. చర్చనీయాంశంగా మారారు.
ప్రభుత్వంపై రైతులను ఉసిగొల్పాలనే దురుద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు అని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. పంట నష్టం అంచనాలకు సంబంధించిన సోషల్ ఆడిట్ రిపోర్ట్ ఈనెల 25న వస్తుంది అని స్పష్టం చేశారు. రైతు భరోసాతో కలిపి ఇన్ ఫుట్ సబ్సిడీ అందజేస్తాం అని ఆయన వెల్లడించారు.
Former: రాష్ట్రంలో అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను విక్రయించేందుకు తీసుకెళ్తే.. ప్రభుత్వం కొనేలోపే ఇలా వర్షాలు రావడం వల్ల వర్షపు నీరు రైతుల కళ్లలో కన్నీరుగా మారుతోంది.
Dotted Lands: చుక్కల భూముల చిక్కులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధం అయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. దశాబ్దాల సమస్యకు చరమగీతం పాడుతూ..చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం, రైతన్నలకు ఇక నిశ్చింత… సర్వ హక్కులూ వారికే ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.. రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు చేస్తూ దాదాపు రూ.20,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణ హక్కును అందించే కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కావలిలో…
Pawan Kalyan: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. అయితే, జనసేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పవన్.. వారిపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు.. నేను సంపూర్ణమైన రైతును కాను.. కానీ, కష్టాల్లో ఉన్న రైతుల బాధ అర్ధం చేసుకునే మానవతా వాదిని అన్నారు.. అన్నీ తెలుసనంటున్న వైసీపీ నేతలు రైతులకేం చేశారు అని నిలదీశారు పవన్.. అకాల వర్షాల వల్ల రైతులు…
Andhra Pradesh: అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు ముగిల్చాయి.. చేతికి వచ్చిన పంట దెబ్బతిని రైతులు నష్టపోయారు.. అయితే, పంట దెబ్బతిన్న రైతులకు ధాన్యం డబ్బులు జమ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు సమయం.. అదీ కూడా కేవలం ఐదు రోజులకే ధాన్యం డబ్బుల్ని నష్టపోయిన రైతుల ఖాతాలో జమ చేశారు.. దీనిపై ఏపీ పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. వర్షాలకు దెబ్బతిన్న రైతులకు ధాన్యం డబ్బులు జమ…
Pawan Kalyan: తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతోంది.. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం ఆవలో అకాల వర్షాలతో పంటలు దెబ్బ తిన్న రైతాంగాన్ని పరామర్శించి, మొలకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు.. మీరు వస్తున్నారని ధాన్యం కొనుగోలు వేగవంతం చేశారని పవన్ కి తెలిపారు రైతులు.. ఇంకా కోతలు కోయాల్సి వుందని, గోనె సంచులు ఇవ్వడంలేదు గోడు వెళ్లబోసుకున్నారు.. నూక , ట్రాన్స్ పోర్ట్ పేరుతో రైతులని మిల్లర్లు దొచేస్తున్నరని…
సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనుగోలు చేసిన రైస్ మిల్లర్లు.. ఆ తర్వాత వాటిని మిల్లులకు తీసుకెళ్లడం లేదు.. లారీల కొరత వల్లే ఈ సమస్య తలెత్తింది. దీంతో తమ పంటను అమ్ముకున్నా.. కొనుగోలు కేంద్రాల్లోనే నిల్వ ఉంచే పరిస్థితి నెలకొందని రైతులు బాధపడుతున్నారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ రెజ్లర్లు చేపట్టిన ఆందోళనకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. తాజాగా రెజ్లర్ల ఆందోళనకు మద్దతుగా రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా నేతలు ఆదివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌కు వచ్చారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై నిరసనలో అగ్రశ్రేణి రెజ్లర్లతో చేరిన రైతులు ఆదివారం కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.