Rahul Gandhi: తాము అధికారంలోకి వస్తే రైతుల ప్రయోజనాలను రక్షిస్తామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్‌తో కలిసి గురువారం మహారాష్ట్రలోని నాసిక్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా 'కిసాన్ మహాపంచాయత్'లో ప్రసంగించారు. నాసిక్ ఉల్లి, ద్రాక్ష, టొమాటోల సాగుకు ప్రసిద్ధి. మహాపంచాయత్ సభ సందర్భంగా రైతులు తమ కష్టాలను చెప్పుకున్నారు.
రైతులకు ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిగిలి ఉన్న ధాన్యాన్ని వెంటనే గిట్టుబాటు ధరకు సేకరించాలని ఆయన సర్కారును కోరారు. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ రైతులతో కలిసి పెనమలూరు నియోజకవర్గంలో ఆయన నిరసన చేపట్టారు.
పెద్దపల్లి జిల్లా మంథనిలో శ్రీ బిక్షేశ్వర దేవాలయంలో శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలకు మాహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వర్షాలు పడకపోవడం వల్ల ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నారని, రాష్ట్రంలో ఎక్కడ కూడా తాగునీటి సమస్య రాకూడదని ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు.
ఏపీలో వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్–2023లో ఏర్పడిన కరువు సాయంతో పాటు రబీ సీజన్ ఆరంభంలో గతేడాది డిసెంబర్‌లో సంభవించిన మిచాంగ్ తుపాన్ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పంట నష్టపరిహారాన్ని వైసీపీ ప్రభుత్వం విడుదల చేసింది.
రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అను సంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం 'రైతు నేస్తం'ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ప్రారంభించారు.
Capital’s Farmers Pension: రాజధాని ప్రాంతంలో తెల్లవారుజామునుండే పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. రాజధాని రైతు కూలీలకు రూ.3000 నుంచి రూ.5000 వేలకు పెన్షన్లు పెరిగాయి. ఇటీవల ఫిరంగిపురం సభలో రాజధాని రైతు కూలీలకు పెన్షన్లు పెంపుదల చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పెరిగిన పెన్షన్లను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంటింటికీ తిరిగి పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే చాలామంది రైతు కూలీలకు పెన్షన్ అందజేశారు. ఇటీవలే ప్రభుత్వం రాజధాని…
హర్యానా-పంజాబ్‌లోని శంభు సరిహద్దులో పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా పలు డిమాండ్ల సాధనకు రైతులు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్యమంలో పలువురు యువకులు కూడా పాల్గొన్నారు. అయితే వారికి ఇదొక చేదువార్త అనే చెప్పవచ్చు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన రైతులను గుర్తించి వారి పాస్‌పోర్టులు, వీసాలను రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఢిల్లీలోకి రాకుండా వారిని నిలువరించేందుకు బారికేడ్లు, కంచెలు నిర్మించారు. అయితే వాటిని ధ్వంసం చేసిన రైతులపై…
రైతులు పంట వేసిన రోజు నుండి ఆ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకొనేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి విషయంలో రైతులకు అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. కేవలం ఒకటి లేదా రెండు పంటల కొనుగోళ్లు చేసి మిగతా పంటలకు గిట్టుబాటు ధర అందించే విషయంలో.. గత ప్రభుత్వ నిర్లక్ష్యధోరణి కారణంగా రాష్ట్రములో 75 శాతం సాగు విస్తీర్ణము రెండు, మూడు పంటల క్రిందకు వచ్చిందన్నారు. ఈ పరిస్థితిని నివారించి అన్నీ…
Garlic: వెల్లుల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుడికి అందుబాటులో లేని విధంగా ధరలు పెరిగాయి. దీంతో ఈ పంటను సాగు చేస్తున్న రైతులు తమ పంటను కాపాడుకునేందుకు అనేక ఏర్పాట్లను చేసుకుంటునున్నారు. గతంలో టమాటో ధరలు పెరిగిన సందర్భంలో దొంగలు పంటల్ని దోపిడి చేసిన ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో వెల్లుల్లి రైతులు పంట దోపిడి కాకుండా వినూత్న చర్యలు తీసుకుంటున్నారు.