BJP For Farmers: కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో రైతుల సమస్యలపై బీజేపీ రణభేరీ మోగించింది. 6 హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీజేపీ నిర్ణయించింది. మరోవైపు రైతుల సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాలో భాగంగా బీజేపీ శ్రేణులు తమ ప్రాంతాల్లోని వడ్ల కల్లాలను సందర్శించి రైతులకు అండగా నిలవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నిర్ణయించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ ఆరోపిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలను అధిగమించి పండించిన వరి పంటను కల్లాలకు తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కల్లాల పర్యటనకు బీజేపీ నిర్ణయం తీసుకున్నారు.
Read also: Canada: కెనడా ప్రభుత్వ నూతన విధానాలతో భారతీయ విద్యార్థుల అవస్థలు
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మండల కమిటీలు, ముఖ్యనేతలతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతుల వివరాలను సేకరించేందుకు నాయకులు వడ్ల కల్లాలో పర్యటించాలని సూచించారు. అందువల్ల ప్రభుత్వం పంట నష్టం వివరాలను సేకరించి వరి పరిస్థితి, అరుగు, తేమతో సంబంధం లేకుండా వరిని కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయాలన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అన్ని రకాల ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేయాలన్నారు. వచ్చే వానాకాలం నుంచి రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు 15 వేలు, రైతు కూలీలకు ఎకరాకు 12 వేలు ఇచ్చే వరకు ప్రభుత్వంపై వివిధ రూపాల్లో నిరసన తెలపాలని సూచించారు. రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటే దాదాపు 35 వేల కోట్ల నిధులు అవసరమని, ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేవని అన్నారు. వీటితో పాటు ఆరు హామీల అమలుకు మరో లక్ష కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పారు.
Kalki 2898 AD : ప్రభాస్ “కల్కి”నుంచి వచ్చేది ఆ ఒక్క పాటేనా..?