రెండు నెలల తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది.. మా ప్రభుత్వంలో వ్యవసాయాన్ని పండగ చేస్తాం, అన్ని పంటలకు మద్దతు ధర కల్పించి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తామని రైతన్నలను ఉద్దేశించి ఉదయగిరి తెలుగుదేశం- జనసేన- బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తెలిపారు. సోమవారం నాడు వింజమూరు మండలం చాకలకొండ జనార్ధనపురం పంచాయతీలలో పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పోలు నాయుడు పల్లి వెళ్లే క్రమంలో వరి కోసిన పొలంలో ట్రాక్టర్ ద్వారా చెత్తను రూలింగ్ చేస్తున్న దృశ్యాన్ని చూశారు.. దీంతో పంట పొలాల్లో గట్ల పైన నడుచుకుంటూ వెళ్లారు. ట్రాక్టర్ ను నడిపిన కాకర్ల రైతు బిడ్డను అనిపించుకున్నారు.
Read Also: Pushpa Teaser: అది సార్ నా బ్రాండ్.. ఏకంగా గూగుల్ తల్లే సలాం కొట్టిందిగా!!
అదే విధంగా డ్రైవర్ల కష్టాలు నాకు తెలుసు అని టీడీపీ- జనసేన- బీజేపీ ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ అన్నారు. వారికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. రైతన్నలు ఈ ప్రభుత్వంలో అనేక కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో రైతులకు సబ్సిడీ ద్వారా ట్రాక్టర్లు వ్యవసాయ పని ముట్లు, ఇంజన్లు, డ్రిప్పు, తదితర వస్తువులను ఇచ్చి రైతులను ప్రోత్సహించింది.. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటినీ రద్దు చేశారు అని ఆయన ఆరోపించారు. డ్రిప్పు లేని కారణంగా రైతన్నలు పంటలు వేయడం కూడా మానేశారన్నారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా రైతన్నలకు అనేక రకాలుగా ఆదాయాలు ఉన్నప్పటికీ, సబ్సిడీని రద్దు చేసి రైతన్నల వెన్ను విరిశారు.. నాలుగు సంవత్సరాలు కాలం పాటు గిట్టుబాటు ధర లేకుండా చేసిన ఈ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇప్పుడు కపట ప్రేమ చూపిస్తుందన్నారు. వీటన్నిటిని గుర్తించుకొని రైతన్నలు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలన్నారు. రైతు ప్రభుత్వం తెలుగుదేశం అని ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కాకర్ల కోరారు. అక్కడ ఉన్న రైతులు వారి కష్టాలను తెలియజేశారు. వాటి అన్నింటినీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే పరిష్కారమయ్యేలా చూస్తానని కాకర్ల సురేష్ హామీ ఇచ్చారు.
Read Also: Kishan Reddy: మూడో సారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారు..
అలాగే, ఉదయగిరి తెలుగుదేశం- జనసేన- బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపు కోసం ఆయన తమ్ముడు కాకర్ల సునీల్ ఆయన సతీమణి కాకర్ల సురేఖ కొండాపురంలోని సాయిపేట గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి తెలుగు దేశాన్ని గెలిపించాలని అభ్యర్థించారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు గత రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని అధికారం ఉంటే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు వీలుంటుందన్నారు. అందుకోసం మా అన్న కాకర్ల సురేష్ ను గెలిపించాలని స్థానిక ప్రజలను కాకర్ల సునీల్ దంపతులు కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తెలుగుదేశం- జనసేన- బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.