Jagadish Reddy: ఇది భయంకరమైన మోసం.. రైతులు ఐక్యం కావాలని జగదీశ్ రెడ్డి పిలుపు
- హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి హేయమైన చర్య
- ఇటువంటి చిల్లర వేషాలకు తాము భయపడమన్న ఎమ్మెల్యే
- కాంగ్రెస్ చేసిన రుణమాఫీ భయంకరమైన మోసమని ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డ మండిపడ్డారు. ఇటువంటి చిల్లర వేషాలకు తాము భయపడమని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ పార్టీ అంతా రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తాం అని మాటిచ్చారని గుర్తు చేశారు. చివరకు రైతులను మోసం చేశారన్నారు. రాష్ట్రంలో హింస ప్రేరేపించాలి అని సీఎం రేవంత్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ చేసిన రుణమాఫీ భయంకరమైన మోసం.. పచ్చి అబద్ధమని విమర్శించారు. బీఆర్ఎస్ రైతుల తరఫున కొట్లాడుతుందన్నారు. అందరికి రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో రైతులు ఐక్యం కావాలి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడాలని పిలుపునిచ్చారు.
READ MORE: Dil Raju: మేమే చెడగొట్టాం… ఓటీటీలపై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్
Also Read
కాగా… రుణమాఫీ అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల నినాదాలతో నిన్న (శుక్రవారం) అర్ధరాత్రి సిద్దిపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం రుణమాఫీ చేసిందని..హామీ మేరకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు రాజీనామా చేయాలంటూ పట్టణంలో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ నేతలతో వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి బీఆర్‌ఎస్ నాయకులను అక్కడి నుంచి పంపించారు. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు హరీశ్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి చేసి అక్కడున్న ఫ్లెక్సీల చింపివేశారు. ఈ ఘటనపై సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఫ్లెక్సీల చింపివేతపై హరీష్ రావు ట్వీట్ చేశారు. మాజీ మంత్రిపైనే దాడి చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
READ MORE: KTR: సమావేశం అనంతరం బీఆర్ఎస్ సంచలన నిర్ణయం.. తమ ఉద్దేశాన్ని ప్రకటించిన కేటీఆర్
సిద్ధిపేట ఎమ్మెల్యే అధికారిక నివాసంపై అర్ధరాత్రి కాంగ్రెస్ గూండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టి, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణమని మండిపడ్డారు. ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయమన్నారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనం అని మండిపడ్డారు. వెంటనే ఈ ఘటనపై @TelanganaDGP గారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు.
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!