PM Modi: రైతులకు, సైనికులకు కాంగ్రెస్ ద్రోహం చేసింది
- కురుక్షేత్రలో మోడీ మెగా ర్యాలీ
- హర్యానాలో మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా
- రైతులకు.. సైనికులకు కాంగ్రెస్ ద్రోహం చేసిందన్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కురుక్షేత్రలో మెగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హర్యానాలో మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ ఖాయమన్నారు. ఈ ర్యాలీలో సీఎం నయాబ్ సైనీపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. అలాగే భాజపా చెప్పింది.. కచ్చితంగా చేస్తుందని అన్నారు. రెండు రోజుల క్రితమే తాము హర్యానాకు ప్రయోజనం కలిగించే పెద్ద నిర్ణయం తీసుకున్నామన్నారు. 70 ఏళ్లు పైబడిన వారికి రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
READ MORE: DGL : నాలుగేళ్లకు సినిమా అనౌన్స్ చేసిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ డైరెక్టర్
Also Read
- TMC CRISIS: మమతా బెనర్జీకి షాక్.. రెబల్ వర్గంలో చేరిన కీలక అనుచరుడు..
- Ashwini Vaishnaw: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటన
- Pakistan: ‘‘అసిమ్ మునీర్ కండోమ్‌లు పంచుతాడా.?’’ పాక్ ఆర్మీ చీఫ్ కొత్త బాధ్యతలపై సెటైర్లు..
- Iran War: ట్రంప్ వార్నింగ్‌తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
ఉద్యోగులకు అనుకూలమైన బీజేపీ ప్రభుత్వం కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చిందని ప్రధాని మోడీ అన్నారు. “ఇందులో ఉద్యోగులకు ఫిక్స్‌డ్ పెన్షన్ గ్యారెంటీ.. ఈ కొత్త పెన్షన్ స్కీమ్‌పై ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేయడంతో విస్తృతంగా స్వాగతించారు. కాంగ్రెస్ రైతులకే కాదు దేశాన్ని కాపాడే సైనికులకు కూడా ద్రోహం చేసింది. మాజీ సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేసింది బీజేపీ ప్రభుత్వమే. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి సొమ్ము ఒక్క జిల్లాకే పరిమితమైంది. బీజేపీ రాగానే హర్యానాలో అభివృద్ధి మొదలైంది. బీజేపీ ప్రభుత్వం రాకంటే ముందు హర్యానాలో సగం ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉండేవి కావని.. కానీ నేడు ఇక్కడ 100 శాతం ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయి.” అని ప్రధాని మోడీ అన్నారు.
READ MORE:Rain Alert: బంగ్లాదేశ్‌ను ఆనుకుని అల్పపీడనం.. ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
హిమాచల్ ప్రదేశ్ మీ పొరుగున ఉందని, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, అయితే హిమాచల్ పౌరులెవరూ సంతోషంగా లేరని ప్రధాని మోడీ అన్నారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ న్యాయమైన జీతాల కోసం సమ్మె చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పీఎం గుర్తు చేశారు. సీఎం, మంత్రులు జీతాలు మానేస్తారంటూ సాకులు చెప్పారని, స్కూళ్లు, కాలేజీలు మూతపడే దశలో ఉన్నాయని, అక్కడి మహిళలకు రూ.1500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి నేటికీ వేలాది మంది మహిళలు ఎదురు చూస్తున్నారన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొడతాం
-
Shravan Month Dreams: శ్రావణ మాసంలో మీ కలలో ఇవి కనిపిస్తే.. మీ దరిద్రం తీరిపోయినట్లే! అవి ఏంటో తెలుసా?
-
TMC CRISIS: మమతా బెనర్జీకి షాక్.. రెబల్ వర్గంలో చేరిన కీలక అనుచరుడు..
-
Jananayagan : విజయ్ లాస్ట్ మూవీతో కిరణ్‌కు తిప్పలు
-
Ashwini Vaishnaw: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటన
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!