హర్యానాలో రైతులు ఆందోళన తీవ్రరూపం దాల్చింది.ఈ క్రమంలో జాతీయ రహదారి-44 ను రైతులు దిగ్బంధించారు. పొద్దు తిరుగుడు పంటకు మద్ధతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న రైతులకు యూపీ, పంజాబ్ రైతులు మద్దతు తెలిపారు.
Jupally Krishna Rao : నాగర్ కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులతో కలిసి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆందోళన నిర్వహించారు. వరి కొనుగోళ్లలో అక్రమాలను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై కలెక్టర్ స్పందించాలని జూపల్లి కృష్ణారావు కోరారు.
Brij Bhushan: డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ పై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్నారు. అతడిని అరెస్ట్ చేయాలంటూ ఏప్రిల్ 23 నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు నిరసన చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం రెజ్లర్లకు మద్దతుగా రైతులు ఈ రోజు ఢిల్లీలో నిరసనలకు పిలుపునిచ్చారు.
Wrestlers Protest: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేస్తున్న రెజ్లర్లు, ఆయన్ను అరెస్ట్ చేయాలని 10 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు. విపక్షాలు, ఇతర సంస్థలు, ప్రముఖులు వారి పోరాటానికి మద్దతు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం రెజ్లర్లకు మద్దతుగా సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. పంజాబ్, హర్యానా, యూపీ నుంచి వచ్చే అనేక మంది…
మహారాష్ట్రలో అన్నదాతలు కదం తొక్కారు. రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 10 వేల మందికి పైగా రైతులు కలిసి దాదాపు 200 కిలోమీటర్ల మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ మహాపాదయాత్ర దిండోరి నుంచి ముంబయి వరకు జరుగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ పెద్దఎత్తున రైతు ఉద్యమానికి సన్నాహాలు జరుగుతున్నాయి. యునైటెడ్ కిసాన్ మోర్చా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్న రైతులు మార్చి 20న పార్లమెంట్ ముట్టడికి సిద్ధమవుతున్నారు.
కామారెడ్డి జిల్లా మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ముగిసింది. మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్ పై రైతులు నగల నుంచి ఆందోళన చేస్తున్నారని తెలిపారు. దానిపై స్పష్టత కోసమే ఈ అత్యవసర సమావేశం నిర్వహించామన్నారు. మేం తీర్మానం చేసినది కాకుండా వేరే మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వానికి పంపించడం జరిగిందని పేర్కొన్నారు.