పంజాబ్, హర్యానా మధ్య గల శంబు దగ్గర నుంచి రైతులు ఢిల్లీకి బయల్దేరారు.. రైతులు ట్రాక్టర్లలో వస్తుండటంతో ట్రాక్టర్ ట్రాలీలను ఢిల్లీలోకి అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో పోలీసుల పైకి రైతులు రాళ్లు రువ్వాగా.. ఆ తర్వాత పోలీసులు పలుమార్లు టియర్ గ్యాస్ విడుదల చేశారు. టియర్ గ్యాస్ షెల్స్ కారణంగా రైతులు ఒక్కసారి వెనక్కి తగ్గారు.
Farmers begins Delhi Chalo March: పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పించడం, 2020-21 ఆందోళనల్లో పెట్టిన కేసుల కొట్టివేత తదితర డిమాండ్లతో పార్లమెంట్ వరకు ర్యాలీ (ఢిల్లీ చలో) చేపట్టేందుకు పలు రైతు సంఘాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సోమవారం రైతు సంఘాలు, కేంద్ర మంత్రుల మధ్య జరిగిన కీలక సమావేశం ఎలాంటి తీర్మానం లేకుండా ముగియడంతో.. ఢిల్లీ చలో మార్చ్‌ను రైతులు మంగళవారం ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు పంజాబ్‌లోని ఫతేగఢ్…
Farmers Delhi Chalo March Today: కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పించడంతో పాటు పలు డిమాండ్ల పరిష్కారం కోసం రైతు సంఘాలు మంగళవారం దేశ రాజధానిలో ‘ఢిల్లీ చలో’ మార్చ్‌కు సిద్ధమైన విషయం తెలిసిందే. ఢిల్లీ చలో మార్చ్ నేపథ్యంలో హస్తినలో ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా 2020-21 మధ్య ఏడాదికి పైగా సాగిన రైతుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని.. ఢిల్లీ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. రైతులు…
144 Section in Delhi ahead of Farmers Protest: తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం ‘ఢిల్లీ చలో’ పేరుతో రైతులు ఆందోళన చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. రైతుల మెగా మార్చ్ నేపథ్యంలో ఢిల్లీలో నెల రోజుల పాటు (మార్చి 12 వరకు) 144 సెక్షన్ విధిస్తూ సోమవారం ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అశాంతి మరియు భద్రతా సమస్యల ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఢిల్లీ సరిహద్దులు సింగు,…
‘ఢిల్లీ చలో’కు రైతులు సిద్ధమవుతున్న వేళ.. వారిని కేంద్ర ప్రభుత్వం ఇవాళ మరో దఫా చర్చలు జరిపేందుకు పిలిచింది. అన్నదాతల డిమాండ్ల పరిష్కారం దిశగా ఈ సమావేశంలో సమాలోచనలు జరిగే ఛాన్స్ ఉంది.
Farmers' protest: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి హామీ ఇచ్చేలా చట్టం తీసుకురావడంతో పాటు రైతుల సమస్యలను పరిష్కరించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతులు ‘ఢిల్లీ చలో’ మార్చ్‌కి పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సహా 200కు పైగా రైతు సంఘాలు ఫిబ్రవరి 13న ఈ మార్చ్ చేయనున్నాయి.
అన్నదాతలు మరోసారి పార్లమెంట్ ముట్టడికి (Parliament) పిలుపునిచ్చారు. డిమాండ్ల పరిష్కారం కోసం భారీగా నోయిడా, హర్యానా, యూపీ నుంచి పెద్ద ఎత్తున రైతులు (Farmers Protest) బయల్దేరారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Punjab: పంజాబ్‌లోని జలంధర్‌లో చెరకు ధరలను పెంచాలని, పలు కేసుల్లో విధించిన జరిమానాలను మాఫీ చేయాలని రైతులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. జలంధర్‌లోని ధన్నోవాలి సమీపంలో రైల్వే ట్రాక్‌పై రైతులు కూర్చున్నారు.
పంజాబ్లో రైతు సంఘాలు రైల్ రోకో నిరసన చేపట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ గురువారం నుంచి మూడు రోజుల పాటు నిరసనకు దిగారు. రైలు పట్టాలపై కూర్చుని రైతులు తమ నిరసనను వ్యక్తం చేశారు.