తెలంగాణలో వరి వేయవద్దని ప్రత్నామ్నాయ పంటలు వేయాలని స్వయంగా కేసీఆర్, మంత్రులు పదే పదే చెవిలో ఇల్లు కట్టుకుని చెబుతూనే వున్నారు. అయితే రైతులు మాత్రం చాలా చోట్ల వరి వైపే మొగ్గు చూపుతున్నారు. వరిపంట వేయవద్దని ప్రభుత్వం ఆదేశించినా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతులు వరినాట్లు వేసేందుకు సిద్ధం కావడం చర్చనీయాంశం అవుతోంది. ప్రత్యామ్నాయ పంటలపై ప్రభుత్వం ప్రకటన చేసింది తప్ప ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహనా కల్పించడం లేదని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు.…
అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ చేపట్టిన 45 రోజుల మహాపాదయాత్ర ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు తిరుపతిలో రాజధాని రైతులు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ నేతలు హజరయ్యారు. అంతేకాకుండా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు కూడా హజరయ్యారు. అయితే ఈ సభకు హజరయ్యేందుకు చంద్రబాబు కూడా తిరుపతి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారిని దర్శించుకొని రైతులు నిర్వహిస్తున్న మహాసభ ప్రాంగణానికి…
సీఆర్డీఏ రద్దు, 3 రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర నిర్వఘ్నంగా పూర్తయ్యింది. న్యాయంస్థానం టూ దేవస్థానం అంటూ చేపట్టి రాజధాని రైతులు పాదయాత్ర 45 రోజుల పాటు కొనసాగింది. ఈ నేపథ్యంల మహాపాదయాత్ర ముగింపుగా ఈ రోజు తిరుపతిలో అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ ఏర్పాటు చేశారు అమరావతి రైతులు. అయితే ఈ సభలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు పాల్గొన్నారు. ఆయన తిరుపతి విమానాశ్రయంకు చేరుకొని అక్కడి నుంచి సభ ప్రాంగణానికి…
3 రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్ర తుదిదశకు చేరుకుంది. గత నెల1న ప్రారంభమైన ఈ పాదయాత్ర నేడు 44వ రోజుకు చేరుకుంది. న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ రాజధాని రైతులు 45 రోజుల మహాపాదయాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో నేడు అలిపిరి పాదాల వద్దకు రాజధాని రైతుల పాదయాత్ర చేరుకుంది. అయితే రేపు తిరుమల శ్రీవారిని రాజధాని రైతులు దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి రాజధాని రైతులకు టీటీడీ అధికారులు…
3 రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ మహాపాదయాత్రను ప్రారంభించారు. గత నెల 1వ తేదీన ప్రారంభమైన ఈ పాదయాత్ర 45 రోజుల పాటు సాగనుంది. చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్ర నేడు 42వ రోజు పాదయాత్ర అంజిమేడులో ప్రారంభం కానుంది. అయితే అంజిమేడు నుంచి 11 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగి రేణిగుంటకు చేరుకోనుంది. రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ఊరురా ప్రజలు, రైతులు,…
వ్యవసాయ చట్టాలపై అలుపెరుగని పోరాటం చేసిన రైతులు తాత్కాలికంగా తమ పోరాటానికి విరామం ప్రకటించారు. ఇవాళ ఉదయం నుండి ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేస్తున్నారు రైతులు. శనివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సొంత రాష్ట్రాలకు ప్రయాణం అవనున్నారు రైతులు. మూడు నాలుగు రోజుల్లో పూర్తి స్థాయిలో సరిహద్దులు ఖాళీ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఢిల్లీ సరిహద్దులు సింగూ ,టిక్రి ,గజీపూర్ లలో సంవత్సరంపైగా(378 రోజులు) ఆందోళన చేపట్టారు రైతులు. సంయుక్త కిసాన్ మోర్చా ,భారతీయ కిసాన్ సంఘ…
గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 11 ఉదయం నుండి ఢిల్లీ సరిహద్దులను రైతులు ఖాళీ చేయనున్నారు. ఢిల్లీ సరిహద్దులు సింఘూ, టిక్రి, గజీపూర్ లలో సంవత్సరంపైగా ఆందోళన చేపట్టిన రైతులు శనివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సొంత రాష్ట్రాలకు ప్రయాణం కానున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా, భారతీయ కిసాన్ సంఘం పేరుతో దేశ వ్యాప్తంగా ఉన్న పలు రైతు…
ఏపీలో 3 రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ మహాపాదయాత్రను ప్రారంభించారు. గత నెల 1న ప్రారంభమైన ఈ పాదయాత్రం ఈ నెల 15న ముగియనుంది. 45 రోజుల పాటు సాగనున్న రైతుల పాదయాత్ర తిరుమలలో ముగిసే విధంగా ప్రణాళికను సిద్దం చేశారు. అయితే రాజధాని రైతుల పాదయాత్రకు ఊరురా ప్రజలు, రైతులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా మద్దతు తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే తాజాగా రైతుల పాదయాత్ర…
కేంద్ర ప్రభుత్వం డిమాండ్లపై సానుకూలంగా స్పందించడంతో ఏడాదికి పైగా సాగిన ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ప్రకటించాయి రైతు సంఘాలు.. ఈ నెల 11న సింఘూ సరిహద్దును రైతులు ఖాళీయనున్నారు.. 11వ తేదీన రైతుల విజయోత్సవాలతో ఆందోళన విరమించాలనే నిర్ణయానికి వచ్చారు.. అయితే, ఆందోళన విరమణ తాత్కాలికమే.. ఇది పూర్తి విరమణ కాదు అంటూ స్పష్టం చేశారు సంయుక్త కిసాన్ మోర్చా నేత గురునామ్ సింగ్ చౌరానీ.. అన్ని డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా ఉండడంతో.. ఆందోళన విరమిస్తున్నామని.. జనవరి…
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో రైతులు చేపట్టిన ఆందోళనకు ఏడాది దాటింది.. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలతో ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ దిగివచ్చారు.. రైతులకు క్షమాపణలు చెప్పి.. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.. అయితే, మరికొన్ని డిమాండ్ల సాధన కోసం రైతులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.. కానీ, తాజా పరిస్థితి చూస్తుంటే ఆందోళన విరమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.. తమ భవిష్యత్తు కార్యాచరణపై…