Master Plan: కామారెడ్డి లో మాస్టర్ ప్లాన్ రద్దు చేయాని డిమాండ్ చేస్తూ.. రైతులు ఉద్యమాన్ని మరింత ఉద్దృతం చేయాలని నిర్ణయించారు. కామారెడ్డి మున్సిపల్ పాలక వర్గం తమ పదవులకు రాజీనామా చేయాలని డెడ్ లైన్ పెట్టారు.
కామారెడ్డి జిల్లా మళ్లీ వేడక్కనుంది. ఇవాళ మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల అత్యవసర సమావేశం నిర్వహించనుంది. పాత రాజం పేట పోచమ్మ ఆలయం వద్ద విలీన గ్రామల రైతులు సమావేశం కానున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారు. ఇవాళ ఇంటింటా బోగి మంటలు వేసి కొత్తపనులకు శ్రీకారం చుడుతున్నారు. అయితే భోగి రోజు కామారెడ్డిలో రైతన్నలు భగ్గు మన్నారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై రైతులు వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. అయితే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అదే సమయంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కామారెడ్డి రైతుల భూ పోరాటం తెలంగాణ మొత్తాన్ని ఉడికిస్తోంది. కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ మంటలు సృష్టిస్తోంది. ఈ నిర్ణయాన్ని అంగీకరించబోమని నిన్ననే నిరసనకు దిగిన రైతులు. ఇవాళ బంద్‌కు కామారెడ్డి పిలుపునివ్వడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
Agitation of Farmers Unions- Demand for implementation of Telangana schemes: తెలంగాణలో అమలు అవుతున్న రైతు సంక్షేమ పథకాలు మాకు కావాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక రైతులు ఆందోళలు, నిరసన ర్యాలీలు చేస్తున్నారు. ఆ రాష్ట్ర, కేంద్ర ప్రభత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సోమవారం రైతులు భారీ ధర్నా చేశారు. దీంతో కర్ణాటక సర్కార్ జాతీయ రైతు సంఘం నాయకులను అరెస్ట్ చేసింది. కర్ణాటకలో కూడా తెలంగాణ రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని…
Farmers protest.. Security of Delhi tightened: దేశంలో రైతులు మరోసారి ఆందోళనలకు సిద్ధం అయ్యారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన రైతులు ప్రస్తుతం నిరుద్యోగంపై పోరుబాట పట్టారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగంపై సోమవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ‘మహా పంచాయత్’ కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది. దీంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ వ్యాప్తంగా కట్టుదిట్టమైన…
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు మరోసారి రైతుల నుంచి నిరసన సెగ ఎదురైంది.. ఈ సారి ఏకంగా అర్వింద్ ఇంటిని ముట్టడించారు రైతులు.. ఆర్మూర్‌లోని అర్వింద్ నివాసం ముందు వడ్లను పారబోసి నిరసన చేపట్టారు రైతులు.. జిల్లా నలుమూలనుండి రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన రైతులు.. బీజేపీ నేతలు చెబితేనే వరి వేశాం.. కాబట్టి ఎప్పటిలాగానే కొనుగోలు కేంద్రాల…
రైతుల నిరసనల సందర్భంగా ప్రధాన వార్తల్లో నిలిచిన పంజాబీ నటుడు దీప్ సిద్ధూ మంగళవారం యాక్సిడెంట్ కారణంగా కన్నుమూశారు. ఢిల్లీ సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆయన నడుపుతున్న తెల్లటి స్కార్పియో వాహనం, ఆగి ఉన్న ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కుండ్లీ-మనేసర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వే అని కూడా పిలువబడే వెస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేపై హర్యానాలోని ఖర్ఖోడా సమీపంలో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో దీప్ సిద్ధూ నటి, స్నేహితురాలు రీనా రాయ్‌తో కలిసి…