కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామ్య పద్ధతిలో ఆమోదించుకున్న “మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు” రద్దు చేయాలని, కనీస మద్దతు ధర(ఎంఎస్పి)కు చట్టబద్ధత కల్పించాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం ప్రారంభమై నేటికి ఆరు నెలలు పూర్తయింది. ఈ నేపథ్యంలో తమ డిమాండ్ల పట్ల మోడీ ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ, “సంయుక్త కిసాన్ మోర్చా” మే 26 వ తేదీన “బ్లాక్ డే” నిర్వహించాలని పిలుపునిచ్చారు.…