Master Plans: కామారెడ్డి జిల్లా మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ముగిసింది.మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ కామారెడ్డి, జగిత్యాల మున్సిపల్ కౌన్సిళ్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు. రెండు మున్సిపాల్టీలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. డ్రాఫ్ట్ ను రద్దు చేస్తూ పాలకవర్గాలు నిర్ణయాలు తీసుకున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్ పై రైతులు నగల నుంచి ఆందోళన చేస్తున్నారని తెలిపారు. దానిపై స్పష్టత కోసమే ఈ అత్యవసర సమావేశం నిర్వహించామన్నారు. మేం తీర్మానం చేసినది కాకుండా వేరే మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వానికి పంపించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టించాయని తెలిపారు. డిజైన్ డెవలప్ మెంట్ ఫోరమ్ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నట్టు తీర్మానించామన్నారు. ప్రభుత్వానికి దీన్ని పంపిస్తామన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కూడా చెప్పారని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. రైతుల వెంటే మేముంటామన్నారు. బీఆర్ఎస్ రైతు ప్రభుత్వమన్నారు. ఎవరికి అన్యాయం జరుగదన్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని సూచించారు. 60 రోజుల అభ్యంతరాలు తీసుకున్నాం కాబట్టి వాటిని కూడా ప్రభుత్వానికి పంపించామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇండస్ట్రీయల్ జోన్ చేయమని స్పష్టం చేశారు.
Read also: Deccan Mall Fire Update: డెక్కన్ మాల్ ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..?
ఎన్టీవీతో మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తు తీర్మానం చేసామన్నారు. రైతులు గ్రామాల ప్రజలు ఆందోళనలు ఆపాలన్నారు. మాస్టర్ ఫ్లాన్ పై రద్దు కోసమే అత్యవసర సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ముసాయిదా రద్దు ఏకగ్రీవ తీర్మానం చేసింది కాకుండా ప్రభుత్వానికి తెలిపామన్నారు. డిజైన్ డెవలప్ మెంట్ ఫోరమ్ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నట్టు తీర్మానించామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇండస్ర్టీయల్ జోన్ ఏర్పాటు కాదన్నారు. రైతుల వెంటనే మేము ఉంటామని తెలిపారు. ఇక్కడ పరిస్థితిపై ఉన్నతాధికారులకు తెలిపామన్నారు.
Read also: Kishan Reddy: ఇప్పటి వరకు అగ్ని ప్రమాదాలైన బిల్డింగ్ లన్నీ అక్రమ కట్టడాలే
మాస్టర్ ప్లాన్ రద్దు పై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీసీ మాట్లాడుతూ.. జగిత్యాల పట్టణం లో మాస్టర్ ప్లాన్ ను అడ్డం పెట్టుకొని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాజకీయ పబ్బం గడపకున్నారని మండిపడ్డారు. సీనియర్ నాయకులుగా ఉన్న జీవన్ రెడ్డి హయంలో జగిత్యాల పట్టణం అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. 1996 లో కాంగ్రెస్ హయంలో తయారు చేసిన మాస్టర్ ప్లాన్ తప్పుల తడాఖ అంటూ ఎద్దేవ చేశారు. మాస్టర్ ప్లాన్ విషయంలో చర్చుంచాడనికి ఆహ్వానిస్తే జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి మాట్లాడుతా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదా మాత్రమే జీవన్ రెడ్డికి ఎందుకు అర్థం కాలేదో తెలియదన్నారు. జీవన్ రెడ్డి ఇకనైనా రైతులను రెచ్చగొట్టకండి అంటూ మండిపడ్డారు. రైతుల ముసుగులో అందోళన చేసేది రాజకీయ నాయకులే అంటూ సంచలన వాఖ్యలు చేశారు. అయితే.. జగిత్యాల మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పర్వదినం తర్వాత జగిత్యాల మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ రైతులు ఆందోళనను మరింత తీవ్రతరం చేసిన విషయం తెలిసిందే..
Cheddi Gang: అమ్మో మళ్లీ వచ్చారు.. మహబూబ్ నగర్ లో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్