Farmers Protest: హర్యానాలో అన్నదాతల ఆందోళన.. కురుక్షేత్ర-ఢిల్లీ జాతీయ రహదారి దిగ్బంధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers Protest: హర్యానాలో రైతులు ఆందోళన తీవ్రరూపం దాల్చింది.ఈ క్రమంలో జాతీయ రహదారి-44 ను రైతులు దిగ్బంధించారు. పొద్దు తిరుగుడు పంటకు మద్ధతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న రైతులకు యూపీ, పంజాబ్ రైతులు మద్దతు తెలిపారు. అదేవిధంగా రైతులకు రెజ్లర్లు సైతం మద్దతు తెలిపారు. రైతులు మంగళవారం హర్యానాలోని కురుక్షేత్ర వద్ద ఢిల్లీ-అమృత్‌సర్ జాతీయ రహదారిని(ఎన్‌హెచ్ 44) దిగ్బంధం చేశారు. పొద్దు తిరుగుడు పువ్వు గింజలకు కనీస మద్దతు ధర ఇవ్వకూడదని హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. రైతులు జాతీయ రహదారిని దిగ్బంధం చేయడంతో ఢిల్లీ-అమృత్‌సర్ జాతీయ రహదారి మీద ట్రాఫిక్ స్తంభించిపోయింది.
Read Also: Aurangzeb Picture: వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా ఔరంగజేబు ఫొటో.. నవీ ముంబై వ్యక్తి అరెస్ట్!
Also Read
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
పొద్దుతిరుగుడు విత్తనాలకు మద్ధతు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. కురుక్షేత్ర జిల్లాలోని పిప్లి సమీపంలోని ఫ్లై ఓవర్‌పై వారు గుమిగూడారు. మహాపంచాయత్‌లో భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్‌తో సహా కీలక రైతు నాయకులతో పాటు, రెజ్లర్ బజరంగ్ పునియా కూడా ఉన్నారు. రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న అగ్రశ్రేణి గ్రాప్లర్‌లలో అతను ఒకడు.
రాష్ట్ర ప్రభుత్వం పొద్దుతిరుగుడు విత్తనాలను మద్దతు ధరకు కొనుగోలు చేయడం లేదని, తమ ఉత్పత్తులను క్వింటాల్‌కు రూ. 6,400 ఎంఎస్‌పీకి రూ. 4,000 చొప్పున ప్రైవేట్ కొనుగోలుదారులకు విక్రయించాల్సి వచ్చిందని నిరసన వ్యక్తం చేసిన రైతులు పేర్కొన్నారు. పొద్దుతిరుగుడు విత్తనాలను క్వింటాల్‌కు రూ.6,400 ఎంఎస్‌పీతో ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతోన్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్‌ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!