అక్కడి రైతులు పరిహారం కోసం పోరు బాటపట్టారు..పండగ రోజు సైతం దీక్ష కొనసాగించారు…రిజర్వాయర్ కోసం భూములిస్తే పరిహారం ఇవ్వడంలేదంటూ ఆందోళన బాటపట్టారు..టెంట్ వేసుకోని మరీ పనిప్రదేశంలో దీక్షలకు దిగారు అన్నదాతలు..ఇంతకీ ఆదిలాబాద్ జిల్లా పిప్పల్ కోఠి రైతుల బాధేంటీ..అధికారులేమంటున్నారు..పరిహారం చెల్లింపుల్లో పరిహాసం ఏంటీ..
Also Read : RRR : ఆర్‌ఆర్‌ఆర్ ఖాతాలో మరో రికార్డ్
ఆదిలాబాద్ జిల్లాలోని తెలంగాణ మహరాష్ట్ర సరిహద్దుల్లో చనాక కోర్టా బ్యారేజీ నిర్మాణం చేస్తున్నారు.. అయితే దీనికి సంబందించిన హత్తీ ఘాట్ పంప్ హౌజ్ నుంచి నీరు ఎత్తిపోస్తే గ్రావిటీ ద్వారా పిప్పల్ కోటి శివారులో రిజర్వాయర్ నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది… పిప్పల్ కోటి రిజర్వాయర్ 368 కోట్ల అంచానా వ్యయం తో 1.423 టీఎంసీ ల సామర్థ్యం తో నిర్మాణం ప్రారంభించింది…అయితే దీనికోసం 1024 ఎకరాల భూమి అవసరం కాగా ముందు గ్రావిటీ కాల్వ,ఆనకట్ట కట్టడం కోసం 187 ఎకరాలు 8 లక్షల చొప్పున పరిహారం చెల్లించి తీసుకున్నారు….ఇంతవరకు బాగానే ఉన్న మిగతా 837 ఎకరాలకు అదే ధర కాకుండా తగ్గించి అంటే 7 లక్ష 8 వేల 517 రూపాయల చొప్పునకట్టించి భూమి తీసుకునేందుకు సిద్దం అయ్యాయారు..కాని భూముల ధరలు పెరుగుతున్న దృష్ట్యా సర్కార్ తగ్గించి పరిహారం చెల్లిస్తుందా అంటూ రైతులంతా ఆందోళన బాటపట్టారు..వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తంచేస్తున్నారు.
Also Read : Gujarat Marriage: గుజరాత్‌లో నోట్ల వర్షం.. దేశమంతా దీనిపైనే చర్చ
వారం రోజులుగా కాల్వ పనులు ,రిజర్వాయర్ నిర్మితమమౌతున్న ప్రదేశంలో టెంట్ వేసుకోని రిలే నిరహార దీక్షలకు దిగారు రైతులు…వీరికి రాజకీయపార్టీల మద్దతు లభిస్తుంది..పండగపూట సైతం కర్షకులు దీక్ష కొనసాగించారు..ఒకవైపు భూముల ధరలు పెరుగుతుంటే ఇంకా ధర తగ్గించి పరిహారం ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..పెరిగిన ధరలకు అనుగుణంగా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.
ప్రస్తుత ధరలకు అనుకూలంగా ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే అధికారులతోపాటు జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్ ను సైతం కలిసి తమ డిమాండ్ అధికారుల ముందుంచారు…ఎవ్వరు పట్టించుకోవడం లేదని దీక్షలు చేస్తున్నారు..వీరికి కాంగ్రెస్ ,బిజెపి నేతలు మద్దతుగా ధర్నాల్లో పాల్గోన్నారు..రైతులను సర్కార్ పెరిగిన ధరలతో పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
దీనిపై అధికారులు మాత్రం 2013 భూసేకరణ చట్టం ప్రకారం 7 లక్షల 8 వేల చొప్పున మాత్రమే పరిహారం చెల్లించే అవకాశం ఉందని అయితే రైతులు మాత్రం ఎక్కువగా చెల్లించాలనే ప్రతిపాదన పెట్టారు..దానిపై ఉన్నతాధికారులు నివేదికలు పంపామంటున్నారు..ఆశించినంతా పరిహారం వచ్చే వరకు తమ పోరాటం ఆపబోమని హెచ్చరిస్తున్నారు అన్నదాతలు.