Section 144 imposed in Noida: పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని కోరుతూ ‘ఢిల్లీ చలో’ కార్యక్రమం చేపట్టిన రైతు సంఘాల ఆందోళనలు శుక్రవారం (ఫిబ్రవరి 16) నాలుగో రోజుకు చేరాయి. ఢిల్లీ చలో ఆందోళనకు మద్దతుగా శుక్రవారం గ్రామీణ భారత్ బంద్‌కు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు పలు పార్టీలు, సంఘాలు మద్దతు ప్రకటించాయి. గ్రామీణ భారత్ బంద్ నేపథ్యంలో నొయిడాలో 144 సెక్షన్ విధించారు. నోయిడా పోలీసులు క్రిమినల్…
నేడు భారత్ బంద్ కు సంయుక్త కిసాన్ మోర్చా సహా అనేక రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతన్నలు చేపట్టిన నిరసనల్లో భాగంగా.. ఈ భారత్ బంద్ ని అత్యంత కీలకంగా కర్షకులు తీసుకున్నారు.
రైతులు చేస్తున్న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు దేశ రాజధాని పోలీసులు భారీ ప్లాన్ కు సిద్ధం అయ్యారు. పంజాబీ రైతుల్ని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు సుమారు 30 వేల టియర్ గ్యాస్ షెల్స్‌ను ఆర్డర్ పెట్టినట్లు తెలుస్తుంది.
దేశవ్యాప్తంగా కనీస మద్దతు ధర(MSP)కి చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని ఢిల్లీని ముట్టడించిన రైతులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
తమ డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. వరుసగా మూడో రోజు కూడా ఆందోళనలకు దిగుతామని రైతులు హెచ్చరించారు.
Farmers Protest: పంటకలు మద్దతు ధర(ఎంఎస్‌పీ)తో సహా 12 డిమాండ్ల సాధనకు కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రైతు సంఘాలు మరోసారి ఆందోళనకు పిలుపునిచ్చాయి. ‘‘ఢిల్లీ ఛలో’’ పేరుతో ఢిల్లీ ముట్టడికి సిద్ధమయ్యారు. అయితే, వీరిని హర్యానా-ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు, కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి. బారికేట్లు, ముళ్ల కంచెలను దాటుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్న రైతులు, ఆందోళనకారులపైకి పోలీసులు టియర్ గ్యాస్ వదులుతున్నారు. డ్రోన్ల సాయంతో వీటిని ఆందోళనకారులపై పడేస్తున్నారు.
Farmers Protest: తన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ, రైతులు ఢిల్లీ ముట్టడికి పిలపునిచ్చారు. పంటకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)తో పాటు రైతులకు, రైతు కూలీలకు ఫించన్లు, లఖీంపూర్ ఖేరీ బాధితులకు ఆర్థిక సాయం వంటి పలు రకాల డిమాండ్లతో ‘ఢిల్లీ చలో’ మార్చ్‌కి బయలుదేరారు. ఇదిలా ఉంటే, వీరిని అడ్డుకునేందుకు పోలీసులు, కేంద్ర బలగాలు హర్యానా-ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించాయి. నిన్నటి నుంచి ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతోంది. వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్‌లను…
Another Tear Gas Attack on Farmers: ‘ఢిల్లీ చలో’ మార్చ్ నిరసన కార్యక్రమంలో భాగంగా దేశ రాజధాని సరిహద్దుల్లో ఉన్న రైతులపై మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగం జరిగింది. మంగళవారం ఉదయం పంజాబ్-హర్యానా సరిహద్దు పాయింట్ల వద్ద పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ ఘటనలో 60 మంది రైతులు గాయపడ్డారని తెలుస్తోంది. పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు దేశ రాజధాని లోపలి వెళ్లేందుకు బారికేడ్లను బద్దలు కొట్టడానికి ప్రయత్నించడంతో రెండు సరిహద్దు పాయింట్ల…