Kamareddy Bandh: కామారెడ్డి రైతుల భూ పోరాటం తెలంగాణ మొత్తాన్ని ఉడికిస్తోంది. కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ మంటలు సృష్టిస్తోంది. ఈ నిర్ణయాన్ని అంగీకరించబోమని నిన్ననే నిరసనకు దిగిన రైతులు ఇవాళ బంద్‌కు కామారెడ్డి పిలుపునివ్వడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతులు చెబుతున్నారు. కామారెడ్డి బంద్‌తో మరింత టెన్షన్ పెరిగింది. చేతిలో ఉన్న పంటపొలాలు ఆగమైతే మాస్టర్ ప్లాన్ ద్వారా మా పొలాలు ఎత్తుపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పొలాలు కోల్పోతే మేము ఏం తినాలి? ఎక్కడికి పోవాలని కామారెడ్డి అన్నదాతలు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. మీ మాస్టర్ ప్లాన్ మాకొద్దంటూ మా పొలం మాకిచ్చెయ్యండి అంటూ కామారెడ్డి రైతు గోస మిన్నంటుతున్నాయి.
Read also: Veera Simha Reddy: బాలయ్య ఉగ్ర నరసింహుడి రూపంలో రానున్నాడు
నిన్న కలెక్టరేట్ ముట్టడితో ఉద్రికత్త చోటుచేసుకోవడంతో.. పోలీసుల ఎంట్రీ ఇవ్వడంతో తోపుట వాదోపవాదాలు జరిగాయి. దీంతో రైతులు నేడు కామారెడ్డి బంద్ కు పిలుపు నిచ్చారు. కామారెడ్డి రైతుల ఆందోళనకు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ మద్దతు పలికారు. నేడు రైతుల ఆందోళనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొనున్నారు. బాధిత రైతులకు సంఘీభావం తెలుపనున్నారు.
ఇక కామారెడ్డి బంద్ కు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కామారెడ్డి రైతు జేఏసీ ఇచ్చిన బంద్ కు కాంగ్రెస్ శ్రేణులు మద్దతు ఇచ్చి అంత పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేసి ప్రజ్ క్షేత్రంలో సభలు జరిపి రైతులతో చర్చించాలని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యం వల్లనే సమస్య జఠిలం అయ్యిందని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం రైతులతో చర్చించి సమస్యలను పరిష్కరించి.. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి కి కాంగ్రెస్ బృందం బయలు దేరింది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సూచన మేరకు రెండు బృందాలుగా కామారెడ్డికి కాంగ్రెస్ నేతలు వెళ్తున్నారు. కిసాన్ కాంగ్రెస్ నుంచి కోదండరెడ్డి, అన్వేష్ రెడ్డి ల నేతృత్వంలో ఒక బృందం.. మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ తోపాటు, సీనియర్ నాయకులు బృందంగా నాయకులు కామారెడ్డి కి బయలుదేరారు.
Read also: Asia Cup 2023: ఈ ఏడాది సెప్టెంబరులో ఆసియా కప్.. ఒకే గ్రూప్‌లో భారత్, పాకిస్థాన్
అయితే కామారెడ్డి బంద్ సందర్భంగా పోలీసుల హై అలెర్ట్ ప్రకటించారు. కలెక్టరేట్ దగ్గర పరిణామాలతో భారీగా పోలీసుల మోహరించారు. రైతు జే.ఏ.సి., బీజేపీ ముఖ్య నేతల హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ నియోజకవర్గ ఇంచార్జీ వెంకట రమణా రెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు. బంద్ జరగనివ్వని పోలీసులుచెబుతున్నారు. దీంతో కామారెడ్డిలో రైతులు, బీజేపీ, కాంగ్రెస్ కు అడ్డుకునేందుకు పోలీసులు బారీగా మోహరించారు. కాగా.. కామారెడ్డిలో బంద్ పై హైటెన్షన్ మొదలైంది.