Vemula Prashanth Reddy Satires On MP Aravind Over Raithu Dharna: నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేపట్టిన రైతు ధర్నాపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చురకలంటించారు. రైతుల్ని దగా చేసిన వ్యక్తే.. రైతుల కోసమే ధర్నా చేయడమా? అంటూ సంభ్రమాశ్చర్యాల్ని వ్యక్తం చేశారు. పసుపుబోర్డు, ఎర్ర జొన్నలు, చెరుకుకు మద్దతు ధర తీసుకొస్తానని చెప్పి.. రైతుల్ని అరవింద్ మోసం చేశాడని ఆరోపించారు. ఏ ముఖం పెట్టుకొని ధర్నా చేస్తున్నావమని నిలదీసిన ప్రశాంత్ రెడ్డి.. నీ మోసపు మాటల్ని రైతులు ఏమాత్రం నమ్మరని అన్నారు.
కుట్రలో భాగంగా రైతు ధర్నాని అరవింద్ తెరమీదకి తీసుకొచ్చామని ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ఎంపీగా గెలిచిన అరవింద్.. ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. అరవింద్ మాటలు నమ్మితే.. మళ్లీ మోసపోతామని, రైతన్నలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోనే ప్రధాని మోదీ ఎందుకు ఫసల్ భీమాని అమలు చేయడం లేదని నిలదీశారు. రైతుల మీద కేసీఆర్‌కు ఉన్నంత ప్రేమ.. ఈ ప్రపంచంలోనే మరెవ్వరికీ లేదని తెలిపారు.
ఇదిలావుండగా.. పసుపు బోర్డ్ తెస్తానని చెప్పి మోసం చేశాడంటూ ఎంపీ అరవింద్ ఇంటి ముందు పసుపు రైతులు మే నెలలో ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే! పెర్కిట్‌లోని ఎంపీ ఇంటి ముందు పసుపు కుప్పలు వేసి.. నిరసన ప్రదర్శన చేపట్టారు. సుమారు అరగంట పాటు ధర్నా చేపట్టారు. గతంలోనూ ఇలాగే ఆయన ఇంటిముందు వడ్లు పోసి రైతులు ధర్నాకు దిగారు.