కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇవాళ భారత్ బంద్ నిర్వహిస్తున్నాయి విపక్ష పార్టీలు. దేశ వ్యాప్తంగా చేపట్టిన బందులో పాల్గొంటున్నాయి. తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు ఏకమయ్యాయి. భారత్ బంద్‌కు కాంగ్రెస్, జనసమితి, లెఫ్ట్ పార్టీలు ఒకే తాటి మీదకు వచ్చాయి. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు..వ్యవసాయ చట్టాలపై గళం వినిపించనున్నాయి విపక్షాలు. జాతీయ రహదారులపై ధర్నాలకు సిద్దమయ్యాయి. తెలంగాణలో ఆర్టీసీ…విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. వీటికి నిరసనగా భారత్ బంద్‌లో పాల్గొంటున్నాయి…
వ్యవసాయ రంగంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొంత కాలంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పంజాబ్ నుంచి గతంలో పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీకి చేరుకొని నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. అటు ఉత్తర ప్రదేశ్ నుంచి కూడా రైతులు ఢిల్లీకి చేరుకొని నిరసనలు చేశారు. ఇప్పుడు రైతులు బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానాలో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. కర్నాల్ లో రైతులు రోడ్డు మీదకు చేరుకొని నిరసనలు…
కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత ఆరు నెలలుగా దేశంలో ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ, కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకోలేదు. ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్న సమయంలో కరోనా మహమ్మారి తీవ్రతరం కావడంతో రైతులు ఢిల్లీని వదిలి వెనక్కి వెళ్లారు. అయితే, ఈ నెల 26 వ తేదీన బ్లాక్ డే నిర్వహించాలని భారత్ కిసాన్ యూనియన్, కిసాన్ సంయుక్త మోర్చా నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హర్యానా, పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకునేందుకు బయలుదేరి వెళ్లారు.…