తాజాగా శిల్పకళా వేదికలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఉదయం ఏఎం రత్నం గురించి మాట్లాడాను, ఇప్పుడు అభిమానుల గురించి మాట్లాడుతాను” అంటూ మొదలుపెట్టిన ఆయన, “తాను పడుతూ లేస్తూ ఉన్నానంటే దానికి కారణం అభిమానులే” అని, “పడినప్పుడు ఓదార్చి, లేచినప్పుడు అభినందిస్తూ తనకు అండగా నిలబడ్డారు” అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ సమయంలో రీమేక్ సినిమాల గురించి ప్రస్తావిస్తూ, “ఎక్కువగా రీమేక్ చేస్తానని తిడతారు. కానీ ఏం చేయమంటారు, నా…
హరిహర వీరమల్లు సందడికి అంతా సిద్ధమైంది. మరికొద్ది గంటల్లోనే హరిహర వీరమల్లు సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగబోతోంది. నిజానికి ఈ వేడుకను ముందు తిరుపతి లేదా విశాఖపట్నంలో నిర్వహించాలని అనుకున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇండోర్ ఈవెంట్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ ప్రారంభమవుతుందని నిర్వాహకులు ప్రకటించినప్పటికీ, 6:30 నుంచి 7:30 మధ్యలో కార్యక్రమం మొదలయ్యే అవకాశం ఉంది.…
వచ్చే ఆగస్టులో జరగాల్సిన భారత్, బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల సిరీస్ వాయిదా పడింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ధ్రువీకరించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), బీసీసీఐ సంయక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొత్త షెడ్యూల్‌ను తరువాత విడుదల చేస్తామని బీసీసీఐ పేర్కొంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 2026లో నిర్వహించేందుకు బీసీబీ సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలాక హింసాత్మక…
ఒకపక్క రాజకీయాలతో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ మరోపక్క సినిమాల మీద కూడా ఫోకస్ పెట్టారు. ఆయన రాజకీయాల్లో బిజీ అవ్వకముందు మొదలుపెట్టిన సినిమాలను ఇప్పుడు పూర్తి చేసి రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆయన హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేశారు. ఆ సినిమా వచ్చే నెల 12వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక ఇప్పుడు ఆయన ముంబైలో ఓజీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. Also Read:Sandeep vs Deepika: స్పిరిట్…
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిన తర్వాత, ఫేక్ అకౌంట్ల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ సినిమా గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ ఫేక్ అకౌంట్లు ఈ చర్చలకు మరింత తావిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు, కానీ ఇంకా అధికారికంగా…
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. కాసేపట్లో భారత్–న్యూజిలాండ్ మధ్య దుబాయ్ వేదికగా మ్యా్చ్ జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఎన్టీవీతో యువ క్రికెటర్లు, క్రికెట్ ఫ్యాన్స్, కోచెస్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు టీమిండియాకు శుభవార్త. కొంత కాలంగా పరుగులు చేయడంలో ఇబ్బందిపడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ సెంచరీ (119; 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) బాదాడు. 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, 76 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకుని మునుపటి రోహిత్‌ను తలపించాడు. చాలా నెలల తర్వాత హిట్‌మ్యాన్ సెంచరీ బాదడంతో ఫాన్స్…
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఢిల్లీ అభిమానులకు తీవ్రంగా నిరాశపరిచాడు. రంజీ ట్రోఫీ 2025లో భాగంగా రైల్వేస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన కింగ్.. సింగిల్ డిజిట్ (6)కే పెవిలియన్‌కు చేరాడు. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో రైల్వేస్ బౌలర్ హరీష్ సంగ్వాన్ బౌలింగ్‌లో బోల్డ్ అయ్యాడు. దాంతో విరాట్ ఆటను చూద్దామని వచ్చిన అభిమానులు నిరాశగా అరుణ్ జైట్లీ స్టేడియంను వీడుతున్నారు. మరోవైపు విరాట్ కూడా అసహనంతో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సబంధించిన…
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రాకతో రంజీ ట్రోఫీ 2025కి కొత్త జోష్ వచ్చింది. అంతర్జాతీయ మ్యాచ్ మాదిరి అరుణ్ జైట్లీ స్టేడియం ‘కోహ్లీ.. కోహ్లీ’ నినాదాలతో హోరెత్తింది. గురువారం ఢిల్లీ, రైల్వేస్ జట్ల మధ్య ప్రారంభమైన రంజీ ట్రోఫీ గ్రూపు-డి మ్యాచ్‌లో విరాట్ బరిలోకి దిగాడు. కింగ్ ఫీల్డింగ్ చేస్తేనే అభిమానులు కేరింతలతో మైదానాన్ని హోరెత్తించారంటే.. ఇక బ్యాటింగ్ దిగి బౌండరీలు బాదితే ఇంకేమన్నా ఉందా?. మొత్తానికి విరాట్ రంజీ ట్రోఫీ 2025కి కళ…
Jana Nayagan: సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చిన తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ చివరి చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా ప్రకటించినప్పటి నుండి, ప్రేక్షకులు సినిమా టైటిల్, విజయ్ ఫస్ట్ లుక్ ఇంకా కొత్త అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. విజయ్ చివరి చిత్రం దళపతి 69, దీని టైటిల్ కోసం మేకర్స్ నేడు ప్రకటించారు. వాగ్దానం చేసినట్లుగానే రిపబ్లిక్ డే సందర్భంగా మూవీ మేకర్స్ చిత్రం టైటిల్, విజయ్ ఫస్ట్…