OG Shooting: OG షూటింగ్లో పవన్ స్టన్నింగ్ లుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకపక్క రాజకీయాలతో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ మరోపక్క సినిమాల మీద కూడా ఫోకస్ పెట్టారు. ఆయన రాజకీయాల్లో బిజీ అవ్వకముందు మొదలుపెట్టిన సినిమాలను ఇప్పుడు పూర్తి చేసి రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆయన హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేశారు. ఆ సినిమా వచ్చే నెల 12వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక ఇప్పుడు ఆయన ముంబైలో ఓజీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
Also Read:Sandeep vs Deepika: స్పిరిట్ పంచాయతీలో తప్పెవరిది? బలైంది ఎవరు?
Also Read
డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య నిర్మాతగా, సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఓజీ షూటింగ్ నుంచి లీక్ అయిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్‌ను బౌన్సర్లు తీసుకెళ్లి కార్ ఎక్కిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందులో వింటేజ్ బెల్‌బాటమ్ ప్యాంట్ ధరించిన పవన్ కళ్యాణ్ లుక్ అదిరిపోయిందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
Also Read:CM Revanth Reddy: కులం వల్ల ఎవరికి సమాజంలో గుర్తింపు రాలేదు..
ఇక ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. నిజానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న అన్ని సినిమాలలో ఈ సినిమా మీదనే అభిమానులలో విపరీతమైన ఆసక్తి నెలకొంది. సుజిత్ స్టైలిష్‌గా పవన్ కళ్యాణ్‌ని చూపిస్తూ ఉండడం, సినిమా లైన్ కూడా ఆసక్తికరంగా అనిపిస్తూ ఉండడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!