NTR Neel: ఏంటీ తాటాకు చప్పుళ్లు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిన తర్వాత, ఫేక్ అకౌంట్ల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ సినిమా గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ ఫేక్ అకౌంట్లు ఈ చర్చలకు మరింత తావిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు, కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ సినిమాను ముందుగా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నారు, కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా జూన్ 25వ తేదీన విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
PM Modi: టార్గెట్ పాకిస్తాన్.. మోడీ నివాసంలో రక్షణ మంత్రి, అజిత్ దోవల్ అత్యున్నత భేటీ..
అయితే, ఇతర హీరోల ఫ్యాన్స్‌గా చెప్పబడుతున్న కొన్ని అకౌంట్ల నుంచి ఇప్పుడు రెచ్చగొట్టే ట్వీట్లు ఎక్కువవుతున్నాయి. ముందుగా, నాగచైతన్య ఫ్యాన్ అకౌంట్‌గా చెప్పబడుతున్న ఒక అకౌంట్ నుంచి, “మేము కూడా జూన్ 25వ తేదీన వస్తున్నాం, దమ్ముంటే అదే రోజు వెనక్కి తగ్గకుండా రమ్మని” సవాలు చేస్తూ ట్వీట్ వచ్చింది. దీనిని ఆధారంగా తీసుకుని మరికొందరు కూడా ట్వీట్లు వేస్తున్నారు. అలాగే, నాని ఫ్యాన్ అకౌంట్‌గా చెప్పబడుతున్న మరో అకౌంట్ నుంచి, “మా నాని ‘పారడైజ్’ సినిమా చూసి భయపడ్డావా? అందుకే క్లాష్ నుంచి తప్పుకున్నావా?” అంటూ మరో ట్వీట్ వేశారు.
NTR Neel: ఆ ఊరిలో ఎన్టీఆర్ – నీల్ షూట్
నిజానికి, నాగచైతన్య సినిమా గానీ, ‘పారడైజ్’ సినిమా గానీ ఇప్పటివరకు విడుదల తేదీని ప్రకటించలేదు. ఎన్టీఆర్-నీల్ సినిమా మాత్రమే సంక్రాంతికి రావాల్సి ఉండగా, అది వాయిదా పడి జూన్ 25వ తేదీన విడుదల అవుతోంది. ఇప్పటివరకు ఈ తేదీకి ఎలాంటి సినిమా విడుదల ప్రకటనలు లేవు. అయినప్పటికీ, అటెన్షన్ కోసమో, గొడవలు సృష్టించాలనో తెలియదు, కానీ ఇతర హీరోల ఫ్యాన్స్ అకౌంట్ల నుంచి రెచ్చగొట్టే మరియు అసభ్యకరమైన ట్వీట్లు వస్తున్నాయి. దీర్ఘకాలంలో, ఇది ఆయా హీరోలకు చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం మాత్రమే అవుతుంది, మరొకటి కాదు.
Also Read
- NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
- Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్‌కు రెడీ!
- Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన 'యశ్ టాక్సిక్'
- Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
తాజావార్తలు
-
Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
-
NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
-
Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్‌కు రెడీ!
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!