ఈ మధ్య ప్రియుడి కోసం భార్యలు భర్తలను కృరంగా హతమారుస్తున్న ఘటనలు వెలుగు చూస్తేనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఓ ఘటన తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు కట్టుకున్న భర్తని దారుణంగా హత్య చేసింది ఓ భార్య. భర్తను హత్య చేసి ఆత్మహత్యగా క్రియేట్ చేసింది. తాగిన మత్తులో ఉన్న భర్త ఛాతిపై కూర్చొని గొంతు నులిమి కిరాతకంగా చంపింది.
ఈ మధ్య ప్రియుడితో కలిసి భర్తలను చంపేస్తున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ తన ప్రేమికుడితో కలిసి తన భర్తను హత్య చేసింది. ఈ సంచలనాత్మక కేసు బండేయా పోలీస్ స్టేషన్ పరిధిలోని అమునా గ్రామానికి చెందినది.
వివాహేతర సంబంధాలన్నీ విషాదాంతమవుతున్నాయి. ప్రియురాలు పిలిచిందని ఆమె ఇంటికి వెళ్లిన ప్రియుడు.. చివరకు తన ప్రాణాలు కోల్పోయాడు. ఇంటికి పిలిచి కొట్టి చంపారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇంటి గోడదూకితే చితక బాదామని ప్రత్యర్ధులు చెబుతున్నారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నోములలో జరిగింది.చెట్టుకు కట్టేసి చితకబాదడంతో తీవ్ర గాయాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి. ఇక్కడ చూడండి.. కొరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఈ యువకుడి పేరు జానయ్య. ఈ యువకుడిని చెట్టుకు కట్టేసి చితకబాదడంతో తీవ్ర…
కన్నపిల్లలను వద్దనుకొని ప్రియుడి మోజులో పడి ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఓ కుమార్తె తీరు నలుగురి ప్రాణాలు తీసింది. కన్నబిడ్డ ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో అవమానంగా భావించిన ఆ తల్లి… తన కన్నతల్లికి చెప్పుకొని ఆవేదన చెందింది. ఇంత పరువు పోయాక ఇక బతకడం దేనికి అనుకొని ఆ తల్లి, అమ్మమ్మ ఇద్దరు మనవరాళ్లను చంపి ఆపైన తాము కూడా ఉరేసుకొన్న విషాద ఘటన తమిళనాడులోని దిండుక్కల్ జిల్లాలో జరిగింది. వివాహేతర సంబంధం నలుగురి ప్రాణాలు తీసింది……
కుమార్తె వేరే వ్యక్తితో వెళ్లిపోవడంతో మనస్తాపంతో ఆమె తల్లి, అవ్వ ఇద్దరు మనవరాళ్లను చంపి ఆపై ఉరేసుకొన్న విషాధ ఘటన తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వేరే వ్యక్తితో వెళ్లిపోయిన మహిళ కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లా ఓట్టన్‌సత్రం సమీపంలోని చిన్నకులిప్పట్టికి చెందిన…
Extramarital affair: లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన కేసులో, తండ్రి మరణానికి 9 ఏళ్ల కొడుకు సాక్ష్యంగా మారాడు. జూన్ 07 రాత్రి రాజస్థాన్‌లోని అల్వార్ లోని ఖేర్లి ప్రాంతంలో జరిగిన ఈ హత్య బాలుడి ద్వారా వెలుగులోకి వచ్చింది. తన తండ్రిని తల్లి, తన ప్రియుడితో కలిసి ఎలా కాంట్రాక్ట్ కిల్లర్లతో కలిసి హత్య చేయించిందనే వివరాలను వెల్లడించాడు. మాన్ సింగ్ జాతవ్ అనే వ్యక్తి ఇంట్లో చనిపోయాడు. అయితే, ప్రారంభంలో అతడి భార్య…
వివాహేతర సంబంధం కారణంగా ప్రతి రోజు దేశంలో ఎందరో ఆత్మహత్య చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలతో మనస్తాపం చెంది భార్య లేదా భర్త చనిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ‘ప్రియుడితోనే ఉంటా, నువ్ చచ్చిపో’ అని భార్య అనడంతో మనస్తాపం చెందిన భర్త.. వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో బోయినపల్లి మండలం తడగొండలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల ప్రకారం… తడగొండకు చెందిన హరీశ్ (36)కు కరీంనగర్…
Bengaluru: బెంగళూర్లో దారుణం ఘటన జరిగింది. నగరంలోని అనేకల్ ప్రాంతంలో 28 ఏళ్ల వ్యక్తి తన భార్య తల నరికి, తలతో పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. శంకర్ అనే నిందితుడు 26 ఏళ్ల తన భార్య మానస వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంగా ఈ భయానక చర్యకు పాల్పడ్డాడు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరీలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. తన భార్య ప్రేమ వ్యవహారంతో విసిగిపోయిన భర్త.. పంచాయితీ పెద్దల ముందు ఆమెను ప్రియుడికి అప్పగించాడు. నిఘాసన్ ప్రాంతంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జార్ఖండ్లోని ఖర్బానీకి చెందిన ఓ మహిళ 18 సంవత్సరాల క్రితం అదే ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడిని వివాహం చేసుకుంది.
Tragedy : మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలోని షమ్నాపూర్ గ్రామంలో ఒక పాశవిక హత్య కేసు వెలుగు చూసింది. ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన ఓ భార్య చివరకు పోలీసుల విచారణలో అసలు నిజాలు ఒప్పుకుని షాక్కు గురి చేసింది. స్థానికంగా అందరినీ కలవరపాటుకు గురిచేసిన ఈ ఘటనలో, లత అనే మహిళ తన భర్త శ్రీను ప్రయాణాన్ని ముగించడానికి మల్లేష్ అనే ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. ఇద్దరి మధ్య కొనసాగుతున్న వివాహేతర…