Delhi High Court: ఒక వ్యక్తి వివాహేతర సంబంధం భార్యను వేధించినట్లు లేదా హింసించినట్లు చూపించకపోతే అది క్రూరత్వం లేదా ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం పేర్కొంది. భర్త వివాహేతర సంబంధం భార్య వరకట్న మరణానికి పాల్పడటానికి కారణం కాదని జస్టిస్ సంజీవ్ నారులా అన్నారు.
Illegal Affair: వివాహేతర సంబంధాలు సంబంధించిన విషయాలు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఓ సంఘటన కాకినాడలో చోటుచేసుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న భార్య బాగోతాన్ని భర్త స్వయంగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. Read Also: iQOO Neo10 Pro+: 7000mAh బ్యాటరీ, 2K OLED డిస్‌ప్లేతో విడుదలకాబోతున్న iQOO నియో10 ప్రో+..!…
వివాహేతర సంబంధాల మోజులో పడి.. కట్టుకున్న భార్యను, భర్తను.. పిల్లలను.. ఇలా అడ్డుగా ఉన్నవారిని అంతా లేపేస్తున్న ఘటనలో ఎన్నో వెలుగుచూశాయి.. ట్రాంజెంబర్‌తో ఎఫైర్ తప్పు అని చెప్పిన వ్యక్తిని కత్తితో నరికి చంపిన ఘటన గుంటూరులో చోటు చేసుకుంది.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామ శివారులో గత రాత్రి నవులూరు గ్రామానికి చెందిన కాశీనా ఈశ్వరరావు అలియాస్ కోటేశ్వరరావును కత్తితో దారుణంగా నరికి చంపారు గుర్తుతెలియని వ్యక్తులు..
Extramarital Affair: ఈ మధ్యకాలంలో భారతదేశంలో అనేక వివాహేతర సంబంధాలకు సంబంధించిన విచిత్ర ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓ మహిళ తన అక్రమ సంబంధానికి అర్థం వస్తున్నాడని భర్తను ముక్కలుగా చేసి డ్రమ్ములో పాతి పెట్టగా.. మరో మహిళ తన కూతురిని వివాహం చేసుకోబోయే వ్యక్తితో పారిపోవడం వంటి అనేక ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. ఈ కోవలోకే తాజాగా మరో విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. 50 సంవత్సరాల పైన ఉన్న మహిళ 30 ఏళ్ల యువ…
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మీరట్ కు చెందిన ముస్కాన్ కేసు ఇంకా చల్లార లేదు. తాజాగా ముజఫర్ నగర్ నుంచి మరో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ రెండేళ్ల క్రితమే వివాహమైన పింకీ అనే మహిళ తన భర్తను చంపడానికి ప్రయత్నించింది. కాఫీలో విషం కలిపి భర్తను చంపడానికి ఆమె కుట్ర పన్నింది. ఈ సంచలనాత్మక కేసులో బాధితుడి సోదరి ఫిర్యాదు మేరకు.. పోలీసులు పింకీపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Man Kills wife: భార్యని నమ్మించి కుంభమేళకు తీసుకెళ్లిన భర్త, ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. తన వివాహేతర సంబంధాన్ని దాచేందుకు పెద్ద కట్టుకథని అల్లాడు. చివరకు యూపీ పోలీసులు 48 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేసి, హత్యకు వెనక ఉన్న కారణాలను వెల్లడించారు. ఢిల్లీలోని త్రిలోక్ పురికి చెందిన ఒక జంట కుంభమేళ కోసం యూపీ ప్రయాగ్‌రాజ్‌కి వచ్చారు. అక్కడే ఒక హోమ్ స్టేలో బస చేశారు.
Medak: మెదక్ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియురాలు దూరం పెట్టిందన్న కోపంతో ప్రియుడు ఆమెను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మెదక్ పట్టణానికి చెందిన రేణుక (45) కనిపించకుండా పోయింది. ఆమె అదృశ్యం నేపథ్యంలో కుమారుడు శ్రీనాథ్ మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా పోలీసు అధికారులు రేణుక ఫోన్ కాల్ డేటాను…
High Court: భర్త తన సహోద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య నిర్లక్ష్యంగా ఆరోపించడం మానసిక క్రూరత్వానికి సమానమే అని కలకత్తా హైకోర్టు చెప్పింది. స్త్రీ, పురుషుల మధ్య స్నేహాన్ని, నేటి సమాజంలో అక్రమ సంబంధంగా భావించలేము అని కోర్టు పేర్కొంది. క్రూరత్వం కారణంగా కుటుంబ కోర్టు తనకు విడాకులు మంజూరు చేయడానికి నిరాకరించడంతో భర్త (పిటిషనర్) హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ కేసుని విచారిస్తూ, హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సహోద్యోగితో వివాహేతర సంబంధం ఉందంటూ…
Shadnagar Murder : షాద్‌నగర్ శివలీల (35) హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం కారణంగానే శివలీల హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లి చేసుకోమన్నందుకు శివలీలను హత్య చేసిన రౌడీషీటర్ దేవదాస్ గతంలోనూ రెండు హత్యలు, అత్యాయత్నాల కేసులో నిందితుడని పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. ఫరూఖ్‌నగర్ మండలం పిట్టలగడ్డతండాకు చెందిన శివలీల తన భర్త మృతి చెందడంతో తన తల్లి దగ్గర ఉంటూ.. కన్హాశాంతివనంలో కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. కర్నూల్‌కు…
Meerpet Murder Case: మీర్పేట్ న్యూ వెంకటేశ్వర నగర్లో జరిగిన హత్యకేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తుందని భావించిన భర్త గురుమూర్తి, తన భార్య మాధవిని హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. మాధవిని హత్య చేసిన గురుమూర్తి, ఆమె మృతదేహాన్ని ఇంట్లోని బాత్రూమ్లో కత్తితో ముక్కలుగా చేసినట్లు పోలీసులు తెలిపారు. రక్తపు మరకలు కనిపించకుండా బాత్రూమ్ను పది సార్లు కడిగినట్లు కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. కేసు దర్యాప్తులో…