ఈ మధ్య ప్రియుడి కోసం భార్యలు భర్తలను కృరంగా హతమారుస్తున్న ఘటనలు వెలుగు చూస్తేనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఓ ఘటన తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు కట్టుకున్న భర్తని దారుణంగా హత్య చేసింది ఓ భార్య. భర్తను హత్య చేసి ఆత్మహత్యగా క్రియేట్ చేసింది. తాగిన మత్తులో ఉన్న భర్త ఛాతిపై కూర్చొని గొంతు నులిమి కిరాతకంగా చంపింది.
READ MORE: Uddhav Thackeray: అవును మేము గుండాలమే, మా “గుండాయిజం” చూస్తూనే ఉంటారు..
కర్ణాటక సరిహద్దులోని నారాయణపేట జిల్లా(మండలం) కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప(32)కు ధన్వాడ మండలం రాంకిష్టయ్య పల్లి గ్రామానికి చెందిన రాధతో పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌లోని బాచుపల్లికి వచ్చారు. ఇక్కడే కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇంతలో రాధ ధన్వాడకు చెందిన ఓ యువకుడితో వివాహేతర బంధం పెట్టుకుంది. ఈ విషయం కాస్త అంజిలప్పకు తెలిసింది. దీంతో ఆ యువకుడితో మాట్లాడొద్దని అంజిలప్ప రాధను మందలించాడు. దీంతో భర్తను అడ్డుతొలగించుకోవాలని భార్య ప్లాన్ వేసింది. గత నెల 23న తాగిన మత్తులో ఉన్న భర్త అంజిలప్ప పడుకుని ఉండగా.. గొంతు నులిమి హత్య చేసింది.
READ MORE: Abhishek Bachchan : ఐశ్వర్యరాయ్ తో డివోర్స్.. ఎట్టకేలకు స్పందించిన అభిషేక్..
తన భర్త అకస్మాత్తుగా చనిపోయాడని అందరినీ నమ్మించింది. అంత్యక్రియల కోసం భర్త మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లింది. మృతదేహం గొంతుపై ఉన్న గాయాలు గమనించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టంలో గొంతుపై ఒత్తిడి వేయడం వల్ల అంజిలప్ప మరణించినట్లు తేలింది. దీంతో భార్యను అనుమానించిన పోలీసులు.. తమదైన స్టైల్ లో విచారించారు. భర్తను తానే చంపినట్లు భార్య రాధ ఒప్పుకుంది. తన ప్రియుడితో మాట్లాడ వద్దని మందలించడం వల్లనే చంపానని చెప్పింది. ఆమెను అరెస్ట్ చేసిన బాచుపల్లి పోలీసులు రిమాండ్ కు తరలించారు.