గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా భార్యలు, భర్తలను చంపుతున్న ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కాటికి పంపిస్తున్నారు. కానీ చేసిన పాపం ఊరికే పోతుందా? భర్తలను చంపి జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు కొందరు మహిళలు. తాజాగా మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసింది ఓ భార్య ఈ ఘటన ఉన్నావ్ లో చోటుచేసుకుంది. జాజ్‌మౌ ప్రాంతంలోని ఇఖ్లాక్ నగర్‌లో నివసిస్తున్న ఇమ్రాన్ అలియాస్ కాలేను అతని భార్య తన ప్రేమికుడు, అతని సహచరుడితో కలిసి హత్య చేసింది. పోలీసులు భార్య, ఆమె ప్రేమికుడిని అరెస్టు చేశారు.
Also Read:Chhangur Baba: వేల మంది హిందూ మహిళల మత మార్పిడి.. ఛంగూర్ బాబా నెట్వర్క్..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇమ్రాన్ భార్య షీబా తన మొదటి భర్తను వదిలేసి ఇమ్రాన్‌ను వివాహం చేసుకుందని సీఓ బిఘాపూర్ రిషికాంత్ శుక్లా తెలిపారు. ఇమ్రాన్ ఈ-రిక్షా నడపడంతో పాటు మాదకద్రవ్యాలకు బానిసయ్యాడు. దీంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. మూడు సంవత్సరాల క్రితం, ఇమ్రాన్ భార్య షీబా అచల్‌గంజ్‌లోని తుర్కిహా బదర్కా నివాసి అయిన ఫర్మాన్ అలియాస్ చున్నాతో పరిచయం ఏర్పర్చుకుంది. వారి స్నేహం ప్రేమగా మారింది. ఇమ్రాన్ ఇల్లు వదిలి వెళ్లిన తర్వాత, ఫర్మాన్ ప్రియురాలు షీబాను కలిసేందుకు ఇంటికి వెళ్లేవాడు. కొంతకాలం తర్వాత ఫర్మాన్ సౌదీ అరేబియాకు వెళ్లాడు.
Also Read:Shocking: హెయిర్ కట్ చేసుకోలేదని తిట్టినందుకు, ప్రిన్సిపాల్‌ని చంపిన విద్యార్థులు..
నాలుగు నెలల క్రితం ఇమ్రాన్ తో గొడవ తర్వాత షీబా తన పుట్టింటికి వెళ్లింది. జూన్ 16న ఫర్మాన్ సౌదీ నుంచి ఇంటికి తిరిగి వచ్చి షీబా ఇంటికి వెళ్లాడు. ఈ విషయం ఇమ్రాన్ కు తెలియగానే అతను తన భార్య షీబాను ఇంటికి తీసుకొచ్చాడు. జూలై 1న షీబా తన ప్రేమికుడి వల్ల గర్భవతిని అయ్యానని తెలుసుకుంది. ఈ విషయాన్ని ఫర్మాన్ కు తెలపగా అబార్షన్ చేసుకోమని కోరాడు. దానికి షీబా ససేమీరా అంది. ఫర్మాన్ ను పెళ్లి చేసుకుంటానని చెప్పి భర్తను వదిలించుకోవడానికి ఆమె ఒక పథకం వేసింది. ఫర్మాన్ తన గ్రామ స్నేహితుడు రఫీక్ ఖురేషి అలియాస్ లల్లి సహాయం తీసుకున్నాడు. జూలై 6 సాయంత్రం, అతను ఇమ్రాన్‌కు ఫోన్ చేసి బయటకు తీసుకొచ్చారు.
Also Read:VC Sajjanar : కాసులకు కక్కుర్తి.. సెలబ్రిటీలపై సజ్జనార్ షాకింగ్ కామెంట్స్
మొదట గంజాయి, తరువాత మద్యం తాగించారు. అతను తాగిన మత్తులో ఉన్నప్పుడు, ఫర్మాన్, రఫీక్ అతన్ని బైక్‌పై కూర్చోబెట్టి ఎనిమిది కిలోమీటర్ల దూరం అచల్‌గంజ్ ప్రాంతంలోని సిటీ డ్రెయిన్ బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి గొంతు కోశారు. మృతదేహాన్ని కాలువలో పడేసి వెళ్లిపోయారు. అటుగా వెళ్లిన వారు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు కుట్ర పన్నిన ఇమ్రాన్ భార్య షీబా, ఆమె ప్రేమికుడు ఫర్మాన్‌లను అరెస్టు చేసి జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు. మూడో నిందితుడు రఫీక్ ఖురేషి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.