Ramayana : బడ్జెట్ 4000 కోట్లు.. బిజినెస్ 250 కోట్లా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ సినీ హిస్టరీ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ‘రామాయణ’. దాదాపు 4 వేల కోట్లతో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ విజువల్ ఎపిక్ పై భారీ అంచనాలే ఉన్నాయి. కానీ ఎంత హైప్ ఉన్నా, ఫస్ట్ పార్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం ఆశించిన స్థాయిలో జరగలేదు అనేటువంటి వార్తలు ఇండస్ట్రీలో చర్చకు దారితీసాయి. దీంతో ట్రైలర్ రిలీజ్ కు ముందే ప్రమోషన్ స్పీడ్ పెంచిన మేకర్స్, ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీని అమలు చేస్తున్నారు.
రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్న ‘రామాయణ’ పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. రామాయణ టీజర్ రిలీజ్ చేయగానే పెదవి విరిచారు సినీ అభిమానులు. కానీ రీసెంట్ గా అమెరికాలోని ఐమాక్స్ థియేటర్లలో ‘ది ఒడిస్సీ’ ప్రదర్శనకు ముందు రామాయణ టైటిల్ ను ప్రదర్శించగా “గూస్ బంప్స్” అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు ప్రేక్షకులు. పూణేలో జరిగిన స్పెషల్ ఈవెంట్ లో ట్రైలర్ చూసిన ప్రేక్షకులు కూడా విజువల్స్, విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్ ను ప్రశంసించారు. ఇదే సమయంలో సాయి పల్లవి, సీత పాత్ర పోషించడం తనకు దక్కిన అదృష్టం అని చెప్పడంతో ఆమె పాత్రపై మరింత ఆసక్తి పెరిగింది.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
అయితే ఇంత భారీ హైప్ ఉన్నా, ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం మేకర్స్ అంచనాలు తగ్గట్లుగా జరగలేదని టాక్ వినిపిస్తోంది. హిందీ థియేట్రికల్ రైట్స్ కు మొదట 450 కోట్లు ఆశించిన నిర్మాత నమిత్ మల్హోత్రా, చివరకు ధర్మ ప్రొడక్షన్స్ కు సుమారు 250 కోట్లకే డిస్ట్రిబ్యూషన్ డీల్ ఇచ్చినట్లు బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు 700 కోట్ల ఓటిటి ఆఫర్ వచ్చినప్పటికీ దాన్ని రిజెక్ట్ చేసి, గ్లోబల్ మార్కెట్, చైనా రిలీజ్ లపై దృష్టి పెట్టినట్లు సమాచారం. మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ ను 1000 కోట్లకు తీసుకువెళ్ళాలన్నది మేకర్స్ లక్ష్యంగా కనిపిస్తుంది.
తాజాగా ‘ప్రథమ్ సంకల్ప్’ పేరుతో ఢిల్లీలో భారీ ఈవెంట్ నిర్వహించి రామాయణ గ్లోబల్ ప్రమోషన్స్ కు శ్రీకారం చుట్టారు. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్, సన్నీ డియోల్ తో పాటు లీడ్ యాక్టర్స్ ఫస్ట్ టైమ్ ఒకే వేదికపై కనిపించారు. ఎంపిక చేసిన అతిథులకు ప్రత్యేకంగా ట్రైలర్ ను ప్రదర్శించడంతో పాటు, దేశవ్యాప్తంగా 500కు పైగా పాఠశాలల్లో ‘రామాయణ స్కూల్ ప్రోగ్రామ్స్’ నిర్వహించి విద్యార్థుల్లో ఈ ఇతిహాసంపై అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. అంటే సినిమా ప్రమోషన్ ను కేవలం ట్రైలర్, పోస్టర్లకే పరిమితం చేయకుండా, ఒక సాంస్కృతిక ఉద్యమంలా తీసుకెళ్ళాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
సాధారణంగా భారీ సినిమాల ప్రమోషన్స్ అంటే పాటలు, ట్రైలర్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్లే గుర్తొస్తాయి. కానీ రామాయణ విషయంలో మేకర్స్ పూర్తిగా భిన్నమైన స్ట్రాటజీని అనుసరిస్తున్నారు. ప్రపంచ మార్కెట్ ను టార్గెట్ చేస్తూనే, భారతీయ సంస్కృతి విలువలను కూడా ప్రమోషన్ లో భాగం చేస్తున్నారు. ఒకవైపు ప్రీ రిలీజ్ బిజినెస్ ను గరిష్ట స్థాయికి తీసుకువెళ్ళే ప్రయత్నం, మరోవైపు గ్లోబల్ బ్రాండ్ గా రామాయణను నిలబెట్టే ప్రయత్నం . ఇప్పుడు జూలై 24న విడుదల కానున్న ట్రైలర్, ఈ హైప్ ను ఎంతవరకు బాక్స్ ఆఫీస్ బిజినెస్ గా మార్చుతుంది అనేదే ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది .
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!