Murali Kishor: ‘లెనిన్’ డైరెక్టర్‌కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Murali Kishor: ‘లెనిన్’ సినిమాతో యువ హీరో అఖిల్ అక్కినేని కెరీర్‌కు సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ మురళి కిషోర్ అబ్బూరి. తన రెండో సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ డైరెక్టర్ ప్రస్తుతం లెనిన్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ డైరెక్టర్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన వార్తలు టాలీవుడ్ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఆయన తన నెక్స్ట్ సినిమాను కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లోనే చేయబోతున్నట్లు తెలుస్తోంది.
సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి సంబంధించిన కథ ఇప్పటికే ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ‘లెనిన్’ తరహాలోనే ఈసారి కూడా ఆయన రూరల్ బ్యాక్‌డ్రాప్‌తో కూడిన బలమైన స్టోరీని సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. గ్రామీణ నేపథ్యంతో పాటు భావోద్వేగాలు, కమర్షియల్ అంశాల మేళవింపుతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో హీరోగా కోలీవుడ్ స్టార్ ధనుష్ అయితే బాగుంటుందనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన పేరును ఈ సినిమాకు ప్రధానంగా పరిశీలిస్తున్నప్పటికీ, ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. త్వరలోనే హీరో ఎంపికపై ఫైనల్ కాల్ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా బయటికి రాలేదు. హీరో, ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వంటి పూర్తి వివరాలు అఫిషియల్ అనౌన్స్మెంట్ తర్వాతే వెల్లడికానున్నాయని సమాచారం.
Also Read
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!