ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మే 6 నుంచి 24 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఇప్పటికే ప్రశ్నాపత్రాల మూల్యాంకనం పూర్తయింది. ఇంటర్ పరీక్షలకు దాదాపు 4,64,756 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇప్పటికే టెన్త్ ఫలితాలు విడుదల కాగా.. ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు కూడా కొన్ని రోజులుగా ఫలితాల విడుదల…
పరీక్షలు రాసే పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. May 23 నుంచి పరీక్షలు పూర్తయ్యే వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండనున్నట్టు ఆర్టీసీ వెల్లడించింది. ఉచితంగా ప్రయాణించాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా.. తమ హాల్ టికెట్లను కండక్టర్లకు చూపించాలని పేర్కొన్నారు. విద్యార్థులు రవాణాపరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆర్టీసీ తరఫున ఈ సౌలభ్యం కలిగిస్తున్నట్టు తెలిపిన ప్రకటన.. ప్రకటనలకు మాత్రమే పరిమితమైందని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా ..…
ఉస్మానియ యూనివర్సీలో డిస్టేన్స్ ఎడ్యుకేషన్ చేస్తున్న విద్యార్థుకుల కీలక ప్రకటన చేసింది ఓయూ. ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్‌ఆర్‌సీడీఈ) ద్వారా అందించే అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. బీఏ, బీకామ్, బీబీఏ తదితర కోర్సుల పరీక్షలను ఈ నెల 18వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించినప్పటికీ, ఈ…
తెలుగు రాష్ట్రాల్లో విద్యారంగం భ్రష్టు పట్టింది. తెలుగు విద్యార్థులు మాతృభాష పేపర్ కూడా రాయలేని దుస్థితిలో ఉన్నారు. ఏపీలో టెన్త్ తెలుగు పేపర్ లీకేజ్ కలకలం రేపింది. లీకేజీ కాదు మాల్ ప్రాక్టీస్ అని తేల్చిన ప్రభుత్వం.. వాట్సాప్ గ్రూప్ పేపర్ సర్క్యులేట్ చేసిన వారిని అరెస్ట్ చేసింది. మాజీ మంత్రి నారాయణతో పాటు 69 మంది టీచర్లు అరెస్టయ్యారు. ఇందులో 35 మంది ప్రభుత్వ స్కూల్ టీచర్లు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. చదువంటే మార్కులే…
ఏపీలో విద్యావ్యవస్థలో లోపాలపై బీజేపీ, బీజేపీ యువమోర్చా ఆందోళన వ్యక్తం చేశాయి. పదవ తరగతి పరీక్ష ప్రతి వ్యక్తి జీవితంలో ఒక మైలు రాయి. ఏ పని చేయాలన్నా , ఏ ఉద్యోగం చేయాలన్నా మెరిట్ చూస్తారు. అంతటి ప్రాధాన్యత ఉంది పదవ తరగతికి. పదవ తరగతి పరీక్షల్లో మొదటగా తెలుగు పేపర్ లీక్ అయింది. పోనీ తర్వాత జరిగే పరీక్షలు అయినా లీక అవకుండా చూడాలి. ప్రతి పేపర్ లీక్ అయ్యింది. విద్యాశాఖలో ఇంతటీ ఘోరం…
ఆరు యూనివర్సిటీ లలో ఉద్యోగార్థులకు ఫ్రీ కోచింగ్ ఇస్తామన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. వర్చువల్ మోడ్ లో ఈ విధానాన్ని ప్రారంభించారు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి. యూనివర్సిటీ లలో ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 6 యూనివర్సిటీ లకు ఆర్థిక సహకారం అందించాం. క్వాలిటీ తో కూడిన కోచింగ్ ఇస్తాం. ఉద్యోగుల కేటాయింపు లో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. పెద్ద ఎత్తున ఉద్యోగ…
ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్ అందింది. రాష్ట్రంలోని విద్యార్థులకు మే 9 నుంచి వేసవి సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. కరోనా కారణంగా రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఏడాది ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను ఈనెల 27 నుంచి మే 9 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు పూర్తవగానే సమ్మర్ హాలీడేస్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.…
హిజాబ్ వ్యవహారంపై అత్యవసర విచారణకు మరోసారి నిరాకరించింది సుప్రీంకోర్టు.. హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ముస్లిం విద్యార్థులు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.. విద్యార్థుల తరఫు సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు ఆదేశాల కారణంగా విద్యార్థులకు వార్షిక పరీక్షలో సమస్య ఏర్పడిందని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు.. విద్యార్థులు పరీక్షలకు హాజరుకాలేరు మరియు ఒక సంవత్సరం నష్టపోలేరు కాబట్టి సమస్య అత్యవసం అన్నారు.. దీనిపై ప్రధాన…
కర్ణాటకలో ప్రకంపనలు సృష్టించిన హిజాబ్ వివాదం సుప్రీంకోర్టు గడప తొక్కింది. విద్యాలయాల్లోకి హిజాబ్‌ను అనుమతించేది లేదన్న ఉడుపి విద్యా సంస్థ ఆదేశాలను కొట్టేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో తమకు న్యాయం జరగలేదని పిటిషనర్లు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలుపు తట్టారు. హైకోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, కర్ణాటకకు చెందిన ముస్లిం…
తెలంగాణలో టెన్త్ పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది. మే 11 నుంచి పరీక్షలు జరగనున్నాయి. అయితే పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసిన నాటి నుంచి విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే కరోనా వల్ల ఈ ఏడాది కూడా అంతంత మాత్రమే క్లాసులు జరిగాయ్. దీంతో విద్యార్థులను పరీక్షలకు ఎలా సన్నద్ధం చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు. అటు పరీక్షలు ఎలా రాయాలో తెలియక విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. తెలంగాణలో చివరిగా టెన్త్ పరీక్షలు 2018-2019…