పరీక్షలు రాసే పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. May 23 నుంచి పరీక్షలు పూర్తయ్యే వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండనున్నట్టు ఆర్టీసీ వెల్లడించింది. ఉచితంగా ప్రయాణించాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా.. తమ హాల్ టికెట్లను కండక్టర్లకు చూపించాలని పేర్కొన్నారు. విద్యార్థులు రవాణాపరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆర్టీసీ తరఫున ఈ సౌలభ్యం కలిగిస్తున్నట్టు తెలిపిన ప్రకటన.. ప్రకటనలకు మాత్రమే పరిమితమైందని పలువురు ఆరోపిస్తున్నారు.
కాగా .. ఆర్టీసీ ఆఫర్ ప్రకటించిన, పదోతరగతి విద్యార్థుల అవస్థలు మాత్రం వర్ణనాతీమనే చెప్పాలి.
ఆర్టీసీ బస్సుల కొరతతో కామారెడ్డి జిల్లా బిచ్కుందలో పదోతరగతి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓవైపు పరీక్ష సమయం దగ్గర పడుతున్నా ఒక్క బస్సుకూడా రాకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. పరీక్షా కేంద్రానికి ఎలా వెళ్ళాలో అర్థం కాని స్థితిలో వుండిపోయారు. పరీక్ష ఎలా రాస్తామో అనే టెక్సన్ లో వున్న విద్యార్థులకు బస్సు రాకపోవడంతో మరో టెక్సన్ ఎదురైంది. దీంతో.. స్పందించిన అధికారులు పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను వ్యాన్ లో తరలించారు. సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల నుంచి ఒకే వ్యాన్ లో 78 మంది బాలికలను తరించారు. దీంతో స్థానికులు మండిపడుతున్నారు.
Maharastra: లోయలో పడ్డ బస్సు.. 15 మందికి తీవ్రగాయాలు
బిచ్కుంద ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కరువైయ్యాయని, మురికి నీరంతా బస్టాండ్ ప్రాంగణంలో ప్రవహించి పందులు, పశువులు సంచరిస్తూ తీవ్రమైన దుర్వాసన రావడంతో ప్రయాణికులు, చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సులు సమయానికి రాకపోవడంతో.. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. సంస్థకు ప్రయాణికులే దేవుళ్లు అంటూ ప్రచారం చేసే అధికారులు బస్టాండ్‌లో నెలకొన్న సమస్యలను మాత్రం పరిష్కరించడం లేదని ప్రయాణికులు మండి పడుతున్నారు.
కాగా.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యకపోయినా… ప్రక్షాళన చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధానంగా బస్సుల సంఖ్యను బాగా తగ్గిస్తోంది. హైదరాబాద్‌లో పాత డొక్కు బస్సుల్ని పక్కన పెడుతోంది. ఐతే… ఆ బస్సుల స్థానంలో కొత్త బస్సులు రావట్లేదు. ఫలితంగా 800 బస్సులు తగ్గిపోయాయి. అందువల్ల ప్రయాణికులు ఇబ్బంది పడటం రొటీన్ సీన్. ఇక ఇప్పుడు పల్లెల్లో 1280 బస్సుల్ని కూడా లేపేయబోతున్నారు. ఫలితంగా తెలంగాణ వ్యాప్తంగా బస్సుల కొరత తప్పదు. ముఖ్యంగా ఉదయం వేళ రైల్వేస్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు సమయానికి బస్సులు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ వాహనాల్లో వెళ్తూ… డబ్బులు ఎక్కువగా చెల్లించుకోవాల్సి వస్తోంది.