భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. నేడు సాయంత్రం 4 గంటల 6 నిమిషాలకు పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్‌ను నింగిలోకి దూసుకెళ్లనుంది.
NASA's James Webb Space Telescope Captures Never Before Seen Cosmic Clouds: నాసా ప్రయోగించిన జెమ్స్ వెబ్ టెలిస్కోప్ మరోసారి విశ్వానికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాన్ని క్యాప్చర్ చేసింది. ఇప్పటికే విశ్వానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన ఫోటోలను తీసింది. బ్లాక్ హోల్స్, అనేక గెలాక్సీలను, నెబ్యులాలకు సంబంధించిన ఫోటోలను తీసి శాస్త్రవేత్తలనే అబ్బురపరుస్తోంది. తాజాగా జెమ్స్ వెబ్ మునుపెన్నడూ చూడని కాస్మిక్ మేఘాలను చిత్రీకరించింది. నారింజ, నీలిరంగు ధూళికి సంబంధించిన ఫోటోలను తీసింది.
Sound Of Earth's Magnetic Field Released By European Space Agency: భూమిపై ఉన్న సమస్త జీవజాలాన్ని భూ అయస్కాంత క్షేత్రం రక్షిస్తుంది. విశ్వం నుంచి వచ్చే ప్రమాదకరమైన రేడియేషన్ పార్టికల్స్, సూర్యుడి నుంచి వెలువడే సౌరజ్వాలలు, సోలార్ తుఫానుల నుంచి భూమిని రక్షిస్తోంది. అయితే ఇంతలా భూమిని రక్షిస్తున్న ఎర్త్ మాగ్నెటిక్ ఫీల్డ్ సౌండ్ ఎలా ఉంటుందో ఎప్పుడైనా విన్నారా..? తాజా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ దీనికి సంబంధించిన సౌండ్స్ రికార్డ్ చేసింది. భూమి…
Sun In Middle Age: మనకు వెలుగునిచ్చి, శక్తిని ఇచ్చి.. సౌరమండలానికి కీలకమైన సూర్యుడు ప్రస్తుతం నడి వయస్సుకు చేరుకున్నట్లు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేసిన పరిశోధనల్లో తేలింది. సూర్యుడు ఏర్పడి ఇప్పటి వరకు 4.57 బిలియన్ సంవత్సరాలు అయింది. సూర్యుడిపై ఇటీవల కాలంలో సౌరజ్వాలలు, బ్లాక్ స్పాట్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వంటి నడి వయస్సు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. దీని కారణంగానే గత రెండు వారాల కాలంగా సూర్యుడి వాతావరణం మరింత…
James Webb Telescope Captures Images Of Cartwheel Galaxy: జెమ్స్ వెబ్ టెలిస్కోప్ విశ్వాంతరాల్లోని అద్భుతమైన ఫోటోలను భూమికి పంపిస్తోంది. మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న అనేక గెలాక్సీ నిర్మాణాలను, నెబ్యులాలను క్యాప్చర్ చేస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా చాలా స్పష్టతతో కూడిన అబ్బురపరిచే చిత్రాలను అందిస్తోంది. దీంతో విశ్వం తొలినాళ్లలో గెలాక్సీల నిర్మాణం, నక్షత్రాలు పుట్టుక, బ్లాక్ హోల్స్ గురించిన మరింత సమాచారాన్ని జెమ్స్ వెబ్ అందిస్తోంది
అత్యంత ఖరీదు.. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానవ ఇంజనీరింగ్, సైన్స్ అద్భుతం జెమ్స్ వెబ్ టెలిస్కోప్ విశ్వానికి సంబంధించి అద్భుత చిత్రాలను పంపిస్తోంది. కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీలు, నెబ్యులా, గ్రహాలకు సంబంధించి వివరాలను వెల్లడిస్తోంది. జెమ్స్ వెబ్ ను ప్రయోగించిన ఆరన్నర నెలల తర్వాత పనిచేయడం ప్రారంభించింది. హబుల్ టెలిస్కోప్ కన్నా కొన్ని వందల రెట్లు మెరుగైన జెమ్స్ వెబ్ విశ్వానికి సంబంధించిన రహస్యాలను చేధించే క్రమంలో ఉంది. భూమికి 15…
మనిషి భవిష్యత్తులో భూమి మీద నుంచి చంద్రునిమీదకు, అంగారకుని మీదకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నారు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రుని వాతారవణంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయి. అక్కడ మానవుని నివాసానికి అనుగుణంగా ఉంటుందా లేదా అనే అంశాలను దృష్టిలో పెట్టుకొని పరిశోధనలు చేశారు. చంద్రునిపైన, మార్స్ పైనా ఘనీభవించిన మంచు జాడలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగోన్నారు. Read: మరో రికార్డ్ సృష్టించిన…
అంతరిక్షం ఎప్పుడూ చాలా ఆసక్తిగా ఉంటుంది. అంతరిక్షంపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే అ కేంద్రంలో కొన్ని రకాల పంటలు పండిస్తున్నారు. అయితే, ఇప్పుడు అంతరిక్షంలో మందులను తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. భూమిపైన తయారయ్యే మందులపై కొన్నిరకాల సూక్ష్మజీవుల ప్రభావం ఉంటుంది. కానీ, అంతరిక్షంలోని పీడనం, వాతావరణం వేరుగా ఉంటుంది. అక్కడ ఎలాంటి సూక్ష్మజీవుల ప్రభావం ఉండదు. దీంతో స్పేస్‌లో మందులను తయారు చేస్తే…