James Webb Space Telescope: అప్పుడే పుడుతున్న నక్షత్రాన్ని క్లిక్ మనిపించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NASA’s James Webb Space Telescope Captures Never Before Seen Cosmic Clouds: నాసా ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మరోసారి విశ్వానికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాన్ని క్యాప్చర్ చేసింది. ఇప్పటికే విశ్వానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన ఫోటోలను తీసింది. బ్లాక్ హోల్స్, అనేక గెలాక్సీలను, నెబ్యులాలకు సంబంధించిన ఫోటోలను తీసి శాస్త్రవేత్తలనే అబ్బురపరుస్తోంది. తాజాగా జెమ్స్ వెబ్ మునుపెన్నడూ చూడని కాస్మిక్ మేఘాలను చిత్రీకరించింది. నారింజ, నీలిరంగు ధూళికి సంబంధించిన ఫోటోలను తీసింది.
అప్పుడే పుట్టుకను ప్రారంభించిన ఓ నక్షత్రం చూస్తున్న విధ్వంసాన్ని క్లిక్ మనిపించింది. ప్రోటోస్టార్ ఎల్1527 నక్షత్రం ఏర్పడుతున్న క్రమంలో దాని చుట్టూ ఆవరించి ఉన్న కాస్మిక్ మేఘాలను ఫోటో తీసింది. ఈ నక్షత్రం టారస్ నక్షత్ర మండలంలో ఉంది. నక్షత్రం చుట్టూ ఉన్న మేఘాలు పరారుణ కాంతిలో మాత్రమే కనిపిస్తాయి. వీటిని జేమ్స్ వెబ్ నియర్-ఇన్ఫ్రారెడ్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేయబడింది.
Also Read
- World Hello Day 2026 : ఒక్క 'హలో'తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
- Anthropic: ఫ్యాక్టరీలు, స్టోర్లు లేవు.. అయినా ఐదేళ్లలో రూ.140 లక్షల కోట్ల కంపెనీగా ఎదిగిన ఆంత్రోపిక్
- Lava Smart 4 Pro: 7,000mAh బ్యాటరీతో Lava Smart 4 Pro లాంచ్.. ధర రూ.10,999 మాత్రమే.. ఫీచర్లు ఇవే!
- Motorola Razr Flex 2027: 12GB RAM, 50MP కెమెరా, 165Hz డిస్ప్లే.. Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది!
Read Also: UK Economic Crisis: ఆర్థిక కష్టాల్లో బ్రిటన్.. 41ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం
నక్షత్రం నుంచి వెలువడుతున్న పదార్థం దాని చుట్టు పక్కల ఉన్న పదార్థంతో ఢీకొట్టినట్లు కనిపిస్తోంది. ఎల్1527 నక్షత్రం వయసు కేవలం లక్ష ఏళ్లు మాత్రమే అని..ఒక నక్షత్ర వయసుతో పోల్చి చూస్తే ఇది కేవలం యవ్వన దశలో మాత్రమే ఉందని నాసా పేర్కొంది. దీన్ని నక్షత్ర ప్రారంభ దశ ప్రోటోస్టార్ గా పరిగణిస్తారు. ఇది భూమికి 430 కాంతి సంవత్సరా దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో వందలాది నక్షత్రాలు పడుతున్నాయి. గత జూలై నుంచి జెమ్స్ వెబ్ టెలిస్కోప్ సేవలను అందిస్తోంది. 10 బిలియన్ డాలర్ల భారీ ఖర్చుతో ఈ టెలిస్కోప్ ను నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు నిర్మించాయి.
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ని భూమిని అత్యంత దూరంగా ఉండే లాగ్రేజ్ పాయింట్ (ఎల్2) కక్షలో ఉంచారు. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో జెమ్స్ వెబ్ ఉంది. అత్యంత స్థిరం ఉండేందుకు జేమ్స్ వెబ్ ని ఎల్2 కక్ష్యలో ఉంచారు శాస్త్రవేత్తలు. విశ్వం పుట్టుక, ఎక్సో ప్లానెట్స్, నక్షత్రాల పుట్టుకకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు జమ్స్ వెబ్ ని ప్రయోగించారు.
Countdown to a new star ⏳
Hidden in the neck of this “hourglass” of light are the very beginnings of a new star — a protostar. The clouds of dust and gas within this region are only visible in infrared light, the wavelengths that Webb specializes in: https://t.co/DtazblATMW pic.twitter.com/aGEEBO9BB8
— NASA Webb Telescope (@NASAWebb) November 16, 2022
తాజావార్తలు
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్‌కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!