ఉక్రెయిన్- రష్యా మధ్య సంక్షోభం కొనసాగుతున్నది. అయితే, ఉక్రెయిన్‌కు నాటో దళాలు, అమెరికా మద్దతు ప్రకటించింది. ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవడానికి రష్యా ప్రయత్నం చేస్తున్నదని అమెరికా స్పష్టం చేసింది. అయితే, నాటో దళాల విస్తరణను ఇప్పటికే రష్యా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. తాజాగా నాటో దళాల విస్తరణను చైనా సైతం ఖండించింది. ఈ విషయంలో రష్యాకు మద్దతు ఇస్తున్నట్టు చైనా పేర్కొన్నది. వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం నేపథ్యంతో రష్యా, చైనా అధ్యక్షులు భేటీ అయ్యారు. తైవాన్ అంశంలో చైనాకు…
ఉక్రెయిన్- రష్యా మధ్య నెలకొన్న సంక్షోభం రోజురోజుకు పెరిగిపోతున్నది. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని రష్యా చెబుతున్నా, అమెరికా మాత్రం రష్యా చర్యలను ఖండిస్తూనే ఉన్నది. తాజాగా జర్మనీకి రెండు వేల మంది సైనికులను తరలించింది. అంతేకాదు, జర్మనీలో ఉన్న వెయ్యిమంది అమెరికా సైనికులను రష్యా సమీపంలో ఉన్న రొమేనియాకు తరలించింది. మరోవైపు ఫ్రాన్స్ సైతం రొమేనియాకు సైన్యాన్ని తరలించేందుకు సిద్దమైంది. ఇప్పటికే డెన్మార్క్ ఎఫ్ 16 విమానాలను రొమేనియా ప్రాంతంలో మోహరించింది. అమెరికా, యూరప్ దేశాలు…
ఉక్రెయిన్ సంక్షోభం రోజురోజుకు పెరిగిపోతున్నది. ఉక్రెయిన్ సంక్షోభం నివారించేందుకు దేనికైనా సిద్ధంగా ఉన్నామని అమెరికా చెబుతున్నది. ఉక్రెయిన్ రష్యా మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు కొన్ని పరిష్కారాలను సూచిస్తూ రష్యాకు లేఖ రాసింది అమెరికా. అయితే, దీనిపై రష్యా ఇంకా స్పందించలేదు. సోవియట్ యూనియన్ దేశాల నుంచి విడిపోయిన దేశాలకు నాటోలో చేర్చుకోకూడదు అన్నది రష్యా వాదన. ఒకవేళ ఈ నిబంధనలను ఉల్లంఘించి నాటోలో చేర్చుకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని రష్యా హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే,…
గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. తగ్గినట్టే తగ్గి వైరస్ కొత్తగా మార్పులు చెంది ఎటాక్ చేస్తున్నది. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా ప్రపంచంలోని దేశాలను చుట్టేస్తున్నది. సౌతాఫ్రికాలో ప్రారంభమైన ఈ వేరియంట్ ఇప్పటికే సుమారు వందకు పైగా దేశాల్లో విస్తరించింది. ముఖ్యంగా యూరప్ దేశాల్లో ఒమక్రాన్ కారణంగా కరోనా కేసులు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. రెండు రోజుల్లోనే ఒమిక్రాన్ కేసులు డబుల్ స్థాయిలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బ్రిటన్, ఫ్రాన్స్,…
ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒకటే భయం పట్టుకుంది. దక్షిణాఫ్రికాలో మొదలైన ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచం మొత్తం చుట్టేసింది. అత్యంత వేగంగా ఈ వేరియంట్ వ్యాపిస్తోంది. సౌతాఫ్రికాలో మొదలైనప్పటికీ ఈ వేరియంట్ కేసులు యూరప్‌లో వేగంగా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా బ్రిటన్‌లో రోజుకు వందల సంఖ్యలో ఈ వేరియంట్ కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటికే సుమారు మూడు వేలకు పైగా కేసులు బ్రిటన్‌లో నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. క్రమంగా ఆసుపత్రులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. Read:…
కరోనా మహమ్మారి ఇప్పట్లో ప్రపంచాన్ని వదిలేలా కనిపించడం లేదు. తగ్గినట్టే తగ్గి కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా యూరప్ దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో మళ్లీ ఆందోళన మొదలైంది. ఆసుపత్రులకు తాకిడి పెరిగింది. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య సైతం పెరుగుతుండటంతో యూరప్ దేశాల్లో ఆంక్షలు కఠినం చేసేందుకు సిద్దం అవుతున్నారు. కరోనా కేసులతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా వేగంగా యూరప్ దేశాల్లో వ్యాపిస్తోంది. యూరప్‌లోని 19 దేశాల్లో ఈ వేరియంట్…
ఆసియాలోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలపై చైనా కన్నేసింది. చైనా బెల్ట్ రోడ్ ప్రాజెక్ట్ పేరుతో వివిధ దేశాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ ఆయా దేశాలను రుణదేశాలుగా మారుస్తున్నది. ఆఫ్రికాలోని అనేక దేశాలను చైనా ఈ విధంగానే లోబరుచుకున్నది. చైనా ఆగడాలకు చెక్ పెట్టేందుకు యూరోపియన్ దేశాల సమాఖ్య 300 బిలియన్ డాలర్లతో గ్లోబల్ గేట్‌వే ను ప్రకటించింది. ఇది చైనా మాదిరిగా చీకటి ఒప్పందాలు ఉండవని, దేశాలను అప్పులు ఊబిలోకి నెట్టడం జరగదని, చిన్న…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా భయపెడుతూనే ఉన్నది. తగ్గినట్టే తగ్గి తిరిగి వివిధ వేరియంట్ల రూపంలో విస్తరిస్తోంది. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బయటపడటంతో ప్రపంచ ఆరోగ్యసంస్థ అన్ని దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే 20కి పైగా దేశాల్లో ఈ వేరియంట్ ఉన్నట్టుగా ప్రపంచ ఆరోగ్యసంస్థ దృవీకరించింది. అయితే, కరోనా మహమ్మారి యూరప్ దేశాలను అతలాకుతలం చేస్తున్నది. Read: మహారాష్ట్రలో కొత్త రూల్స్: ఆ దేశాల నుంచి వచ్చే వారికి… రోజువారి కేసులు భారీ…
ప్రపంచంలో సంతోషకరమైన జీవితాలను గడిపే ప్రజలున్న దేశాల్లో ఫిన్లాండ్ మొదటిస్థానంలో నిలిచింది. ఇలా మొదటిస్థానంలో నిలవడం ఇది నాలుగోసారి. సంతోషం మెండుగా ఉన్నప్పటికీ ఆ దేశాన్ని ఓ సమస్య పట్టిపీడిస్తోంది. అదే జనాభా. ఫిన్లాండ్లో జనాభ తక్కువగా ఉంది. పశ్చిమ యూరప్ దేశాల్లో జనసాంద్రత తక్కువగా ఉంటుంది. అయితే, ఫిన్లాండ్లో ఈ జనసాంద్రత మరీ తక్కువగా ఉన్నది. ఫిన్లాండ్ మొత్తం జనాభ 5.2 మిలియన్ మంది. ఇందులో పనిచేయగలిగే వయసున్నవారు కేవలం 65 శాతం మంది…