స్పెయిన్‌లో మంకీపాక్స్ కారణంగా తొలి మరణం సంభవించిన 24 గంటల్లోనే మరొకరు ప్రాణాలు కోల్పోయారు. యూరప్‌లోనే ఇది రెండవ మరణంగా నమోదైంది. ప్రస్తుతం ప్రపంచంలో మంకీపాక్స్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న దేశాల్లో స్పెయిన్ ఒకటి. ఆ దేశంలో ఇప్పటి వరకు 4298 మంది వ్యాధి బారిన పడ్డారు.
Monkeypox cases in world: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రత ఇంకా తగ్గుముఖం పట్టకముందే.. మంకీపాక్స్ రూపంలో మరో వైరస్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. బ్రిటన్ లో ప్రారంభం అయిన ఈ కేసులు నెమ్మదిగా యూరప్ లోని అన్ని దేశాలకు వ్యాపించాయి. ఇక అమెరికాలో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) మంకీపాక్స్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఇక భారత్ లో కూడా మొత్తం 4 కేసులు నమోదు…
Monkeypox Declared A Global Health Emergency By WHO: ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్ఓ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న మంకీపాక్స్ వ్యాధిని అసాధారణ సంఘటనగా పరిగణించింది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో పాటు వివిధ దేశాలకు విస్తరిస్తుండటంతో మంకీపాక్స్ ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర స్థితిగా ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. మంకీపాక్స్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలా..? వద్దా..?…
ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ కొడుకు వరుణ్; ప్రముఖ నటి, నిర్మాత శ్రీదేవి, బోనీకపూర్ల కుమార్తె జాన్వీ కపూర్ తొలిసారి జంటగా నటిస్తున్న సినిమా ‘బవాల్’. ఈ క్యూట్ లవ్ స్టోరీని ‘దంగల్’, ‘చిచ్చోరే’ ఫేమ్ నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్నారు. సాజిద్ నడియాద్ వాలా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆ మధ్య లక్నోలో మొదలైంది. ఓ పట్టణానికి చెందిన కుర్రాడు, తమ ఊరికే చెందిన ఓ అందమైన అమ్మాయిని ఎలాగైనా పెళ్ళి చేసుకోవాలని కలలుకంటూ…
ప్రపంచాన్ని మంకీపాక్స్ కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని 51 దేశాల్లో 5 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. అనుమానితుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇదిలా ఉంటే యూరప్ లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. యూరప్ లో గత రెండు వారాల్లో కేసుల సంఖ్య 3 రెట్లు పెరిగింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. మంకీపాక్స్ కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ యూరప్ దేశాలకు సూచించింది. ప్రపంచంలో నమోదైన కేసుల్లో…
యూరప్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఇవాళ డెన్మార్క్ వెళ్లారు. తొలిరోజు జర్మనీలో పర్యటించిన ఆయన.. రెండో రోజున అక్కడి నుంచి కోపెన్‌హాగన్ ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. అక్కడ మోడీకి డెన్మార్క్ ప్రధాని మెట్టి ఫ్రెడరిక్సన్ స్వాగతం పలికారు. తర్వాత ఇద్దరూ కలిసి డెన్మార్క్ ప్రధాని అధికారిక నివాసం మానియన్ బోర్గ్‌కు చేరుకున్నారు. అక్కడ ఫ్రెడరిక్సన్.. తన నివాసం మొత్తాన్ని మోడీకి చూపించారు. భారత పర్యటనకు వచ్చినప్పుడు.. తనకు మోడీ గిఫ్ట్‌గా ఇచ్చిన పెయింటింగ్‌ను కూడా…
రష్యా ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు మరింత దిగజారాయి. ఉక్రెయిన్‌లోని రెండు ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ డిక్లరేషన్‌పై సంతకం చేయడంతో పరిస్థితులు దిగజారాయి. రష్యాతో ఉన్న అన్ని రకాల సంబంధాలను ఉక్రెయిన్ తెగతెంపులు చేసేసుకున్నది. రెండు స్వతంత్ర దేశాలల్లో శాంతిని పరిరక్షించడం కోసం రష్యా తన సైన్యాన్ని ఆ రెండు దేశాలకు పంపింది. పదేళ్లపాటు రెండు దేశాల్లో రష్యా దళాలు ఉంటాయి. స్వతంత్ర ప్రాంతాలతో పాటు రష్యా ఉక్రెయిన్ మొత్తాన్ని ఆక్రమించుకుంటుందనే సంకేతాలు…
యూరప్‌లో యూనిస్ తుఫాన్ ధాటికి చిగురుటాకులా వణికిపోతున్నది. గంటకు 196 కిమీ వేగంతో గాలులు వీస్తున్నాయి. గాలులు వేగంగా వీస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. రోడ్డుపై నడుస్తున్న వ్యక్తులు గాలులు ధాటికి రోడ్డుపైనే పడిపోతున్నారు. ఇక ఈ ఈదురుగాలులకు విమానాలు ఊడిపోతున్నాయి. పైకప్పులు ఎగిరిపోతున్నాయి. యూరప్‌లో ఎటు చూసినా ఇప్పుడు ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ తుఫాన్ ధాటికి ఇప్పటికే సుమారు 9 మంది మృతి చెందారు. భారీ వృక్షాలు…
ఆవుపాలు, గేదెపాలను అధికంగా తీసుకుంటుంటారు. అయితే, కొంతమందికి ఈ పాలు పడవు. ఇలాంటి వారు సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్, ఓట్ మిల్క్ వంటివి తీసుకుంటు ఉంటారు. అయితే, ఇప్పుడు కొత్తగా ఆలూ మిల్క్ అందుబాటులోకి వచ్చాయి. స్వీడన్‌కు చెందిన డగ్ అనే కంపెనీ ఆలూ మిల్క్‌ను యూకేలో ప్రవేశపెట్టింది. ఈ ఆలూ మిల్క్‌లో వివిధ విటమిన్స్‌తో పాటు రుచికరంగా కూడా ఉండటంతో వీటిని తాగేందుకు యూకే వాసులు ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా ఆవులు, గేదెలు వంటి…