కరీంనగర్ మట్టికి మొక్కి, మీ ఆశీర్వాదంతో... కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టాలని, ఈ ముగింపు సభను పెట్టుకున్నామని ప్రజలనుద్దేశించి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్లో బీజేపీ 5వ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ సందర్భంగా ఈటల మాట్లాడారు.
ఆర్థిక పరిస్థితి పై హరీష్ రావుతో బహిరంగ చర్చకు సిద్దమని, ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తా అని ఈటెల సవాల్ విసిరారు. ప్రజల డబ్బుతోనే ఓట్లు కొనే నీచ సంస్కృతికి కేసీఆర్ దిగజారాడని ఆరోపించారు. 2021 22 ఆర్థిక సంవత్సరం కి 36 వేల కోట్లు వడ్డీ కడుతుందని అన్నారు.
Etela Rajender criticized CM KCR: బైంసాలో జరుగుతున్న బీజేపీ బహిరంగ సభలో నాయకులు, టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ తన చెప్పు చేతుల్లో పోలీసులను పెట్టుకున్నారని.. పోలీసులు 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర బహిరంగం సభను అడ్డుకోవాలని చూశారని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ విమర్శించారు. కోర్టు బహిరంగ సభకు అనుమతి ఇచ్చిందని అన్నారు. ఇంతపెద్ద పార్టీ బహిరంగ సభ రెండు గంటలే ఉంటుందా..? అని…
మునుగోడు ఉప ఎన్నికలో కేవలం కమ్యూనిస్టులు, ఎంఐఎం, పోలీసుల బిక్షతోనే టీఆర్ఎస్ పార్టీ గెలిచింది.. కానీ, నల్గొండలో కమలం వికసించిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలో బీజేపీలో చేరికలు ఆగవు.. టీఆర్ఎస్ ఆరిపోయే దీపం లాంటిదని చెప్పుకొచ్చారు.. ఇక, కేటీఆర్.. సీఎం కేసీఆర్‌ను మించిపోయారని ఫైర్ అయ్యారు.. కేటీఆర్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది… కాంగ్రెస్, కమ్యూనిస్టు కంచుకోటలో నేను రాజీనామా చేసి వస్తే ఆదుకున్నాని.. ప్రజలకు శిరస్సు వంచి…
తెలంగాణలో ఉత్కంఠరేపుతోన్న మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల వెల్లడిలో కాస్త జాప్యంపై అన్ని పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.. అధికార టీఆర్ఎస్ పార్టీ ఓవైపు.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఇంకో వైపు మండిపడుతున్నాయి.. అయితే, మరో ముందడుగు వేసిన బీజేపీ నేతలు.. ఏకంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌కు ఫోన్ చేయడం వివాదాస్పదంగా అయ్యింది.. ఈసీకి ఫోన్ చేసి బీజేపీ నేతలు ఎందుకు ఒత్తిడి తెస్తారని అంటూనే.. ఫలితాలు త్వరితగతిన ఒత్తిడి లేకుండా విడుదల చేయాలని…
వేరే పార్టీ ర్తు మీద గెలిచినా వాళ్లకు మంత్రి పదవి ఎలా కట్టబెట్టారు? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? అని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మీరెలా 8 ఏళ్లలో ప్రతిపక్షాలను పడగొట్టి చెడగొట్టరో మేము కూడా దేశంలో ఉన్న అన్ని కోర్టులకు, మేధావులకు డేటా పంపిస్తామన్నారు.