హుజూరాబాద్ లో ఏం జరిగిందో మునుగోడు లో అదే రిపీట్ అయ్యిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. నీవూ హుజూరాబాద్ ఓటర్స్ కు పంచిన డబ్బుపై ఓటుకు నోటు కేసు పెట్టోద్దా? అని ప్రశ్నించారు. 2018 లో ఇచ్చిన అనేక హామీలు ఎందుకు అమలు చేయలేదు? అని మండిపడ్డారు.
మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. కాంగ్రెస్ నుంచి కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ డ్రామాలు ఆడిచ్చారని బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు.
Bandi Sanjay’s election campaign in Munugode: ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ మునుగోడు ఉప ఎన్నికలు.. పార్టీల మధ్య ప్రచార జోరు రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలో ఇప్పటికే పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు. గ్రామ గ్రామాన తిరుగుతూ.. ఒకరిమీద ఒకరు విమర్శనాస్త్రాలు వేసుకుంటూ.. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ పార్టీకీలక నేతలను రంగంలోకి దింపుతున్నారు. ఇక నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎన్నికల…