Etela Rajender: కరీంనగర్ గడ్డ తెలంగాణకు దిక్సూచి.. బీఆర్‌ఎస్ భరతం పడతాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender: కరీంనగర్ మట్టికి మొక్కి, మీ ఆశీర్వాదంతో… కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టాలని, ఈ ముగింపు సభను పెట్టుకున్నామని ప్రజలనుద్దేశించి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్‌లో బీజేపీ 5వ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ సందర్భంగా ఈటల మాట్లాడారు. కేసీఆర్… కాళేశ్వరం ప్రాజెక్ట్ ను మొదలు పెట్టినప్పుడు ఇది మనకు శ్రీరామ రక్ష అన్నడు.. ఇది ఒక మానవ అద్భుతం అన్న ఆయన… గత 4 నెలలుగా అక్కడికి చీమను కూడా పోనివ్వడం లేదని విమర్శించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల దగ్గర పోలీసు బూట్ల సప్పుడు తప్ప, ఎవరినీ పోనివ్వడం లేదని ఆరోపించారు.
తెలంగాణ ప్రజల రక్తపు చుక్కల మీద లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే… మొన్నటి వరదకి, మోటార్‌లు మునిగిపోయాయని విమర్శలు గుప్పించారు. కన్నెపల్లి పంపు హౌజ్‌లో 18, అన్నారంలో 12 పంపులు మునిగాయన్నారు. తాను చెప్పేది తప్పైతే… ఈ ఎస్‌ఆర్‌ఆర్ కాలేజ్ గ్రౌండ్‌కి వచ్చి సమాధానం చెప్పు కేసీఆర్ అంటూ సవాల్ విసిరారు. కాంట్రాక్టర్లకు మాత్రం రూపాయి బాకీ లేకుండా చెల్లించారని అన్నారు. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ భూ నిర్వాసితులకు ఈనాటికి ఒక్క పైసా ఇవ్వలేదని ఆరోపించారు. రైతుల భూములను నిండా ముంచి, రైతుల నోట్లో మట్టి కొట్టిన మూర్ఖుడు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. ఎస్సారెస్పీ ఎత్తిపోతల ద్వారా ఒక్క చుక్క నీరు రాలేదు… వచ్చింది అంతా వరదతోనే అంటూ ఆయన తెలిపారు.
Also Read
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
Bandi Sanjay: కరీంనగర్ సభలో కన్నీళ్లు పెట్టుకున్న బండి సంజయ్
మార్పుకు నాంది కరీంనగర్ అని.. డబ్బులకు ఎదురొడ్డిన జిల్లా అంటూ ఈటల రాజేందర్ తెలిపారు.2006లో డబ్బులతో నాయకులను కొన్నా… కరీంనగర్ ప్రజలు తనను గెలిపించారన్నారు. హుజూరాబాద్‌లో 4000 కోట్లు ఖర్చు పెట్టినా… చైతన్య ప్రజలు తనను గెలిపించారన్నారు. ఈ 8 ఏళ్లలో లక్షల కోట్లు ఎలా సంపాదించావో సమాధానం చెప్పు కేసీఆర్ అంటూ ఈటల ప్రశ్నించారు. కేసీఆర్‌కు యావ అంతా కుటుంబం మీదే… తెలంగాణపై కాదన్నారు. తెలంగాణలో ఇవాళ ఎవరు సుఖంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. సర్పంచ్‌లది సుంకరోళ్లకంటే అధ్వాన్న పరిస్థితి అని ఆయన అన్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, పార్టీల మధ్య ఇనుప కంచెలు పెట్టారంటూ ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ఏ వర్గానికి చెందిన ప్రజలు సుఖంగా లేరన్నారు. మత్స్యకారుల కళ్ళలో మట్టి కొట్టాలని చూస్తే… సహించేది లేదన్నారు. కరీంనగర్ గడ్డ తెలంగాణకు దిక్సూచి అని.. బీఆర్‌ఎస్ పార్టీ భరతం పడతామన్నారు.
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!