మునుగోడు ఉప ఎన్నికలో కేవలం కమ్యూనిస్టులు, ఎంఐఎం, పోలీసుల బిక్షతోనే టీఆర్ఎస్ పార్టీ గెలిచింది.. కానీ, నల్గొండలో కమలం వికసించిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలో బీజేపీలో చేరికలు ఆగవు.. టీఆర్ఎస్ ఆరిపోయే దీపం లాంటిదని చెప్పుకొచ్చారు.. ఇక, కేటీఆర్.. సీఎం కేసీఆర్‌ను మించిపోయారని ఫైర్ అయ్యారు.. కేటీఆర్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది… కాంగ్రెస్, కమ్యూనిస్టు కంచుకోటలో నేను రాజీనామా చేసి వస్తే ఆదుకున్నాని.. ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అంటూ రాజ్ గోపాల్ రెడ్డి హుందాగా వ్యవహరించారని ప్రశంసించారు.. డబ్బు, మద్యం అని కేటీఆర్ చిల్లరగా మాట్లాడారు.. కమ్యూనిస్టుల కాళ్లు పట్టుకొని దగ్గరకు తీసుకున్నారు కేసీఆర్ అని ఎద్దేవా చేశారు.. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే సంస్కృతి కేసీఆర్‌ది అని మండిపడ్డారు.. 18 వేల 900 మంది టీఆర్ఎస్ వాళ్లు పని చేశారు… 5 గ్రామాలకు ఒక్క ఎస్‌ఐ చొప్పున పర్యవేక్షణ కోసం పెట్టారు.. పంపిస్తున్న డబ్బులు, బహుమతులు అందుతున్నాయా? లేదా? అని చూసే బాధ్యత అప్పగించారు అని విమర్శించారు.
Read Also: Koti Deepotsavam 2022: 8వ రోజు కోటి దీపోత్సవం కార్యక్రమాలు ఇవే..
ఇక, జీహెచ్‌ఎంసీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టింది వాస్తవం కాదా? అని నిలదీశారు ఈటల రాజేందర్.. 2014 తర్వాత కేసీఆర్ డబ్బును, పోలీసులను నమ్ముకున్నారన్న ఆయన.. కమాండ్ కంట్రోల్ రూం పెట్టుకొని చేస్తుంది ఏంది? నా గుమస్తా దగ్గర 90 లక్షలు ఉన్నాయని టాపింగ్ చేయక పోతే ఎలా తెలుస్తుంది… ? అని ప్రశ్నించారు. మీరు 5 వేలు ఓటుకి ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఫైర్ అయ్యారు.. రాజ్ గోపాల్ రెడ్డి… టీఆర్ఎస్ పుట్టక ముందే కాంట్రాక్టర్.. 35 సంవత్సరాల కోసం…. 18 వేల కోట్ల టెండర్ అన్నారు.. కాళేశ్వరం, మిషన్ భగీరథ కు కాంట్రాక్టర్లు పనులు చేయకుండానే డబ్బులు తీసుకున్నారా? అని నిలదీశారు.. పెయిడ్ వర్కర్స్ ని పెట్టుకుని మా పై దాడులు చేస్తున్నారు.. పలివెలలో ఎవరు ఎవరి మీద దాడి చేశారో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు..
అక్కడ పని చేసిన మంత్రులు, ఎమ్మేల్యేలు అసలు విషయం ఏందో అర్థం అయింది…. తమ నియోజక వర్గాల్లో గెలవడం కష్టం అని అనుకుంటున్నారు అట అని ఎద్దేవా చేశారు ఈటల.. నల్గొండలో పార్టీ కమలం వికసించింది… ఖమ్మంలోనూ వికసిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. కేసీఆర్‌కి శ్రీరామ రక్ష ప్రజలు కాదు… సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, కమాండ్ కంట్రోల్ రూమ్ ఆయనకు శ్రీరామ రక్ష అని సెటైర్లు వేశారు. మరోవైపు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీల అప్పులు తీరిపోయాయన్న ఆయన.. పదవులు వస్తాయి పోతాయి , వ్యక్తిత్వం ముఖ్యం కేటీఆర్ అంటూ హితవు పలికారు.. అధికారం లేకుంటే వాళ్లు బతక లేరు అని ఆరోపించారు. మునుగోడులో ఎంత పని చేయాలో అంత చేయలేదు అనే భావన మాకు కూడా ఉందన్న ఆయన.. టీఆర్ఎస్ వాళ్లు ఊహించిన అన్ని ఓట్లు వాళ్లకు రాలేదన్నారు.. నల్గొండలో బీజేపీకి అన్ని ఓట్లు ఎలా వచ్చాయని ఆలోచిస్తున్నారు వారు.. ఇక, బీజేపీలో చేరికలు ఆగవు.. టీఆర్ఎస్ ఆరిపోయే దీపం అని వ్యాఖ్యానించారు ఈటల రాజేందర్.