న్యూయార్క్ ,లండన్ లలో కరెంట్ పోవచ్చు.. హైదరాబాద్ లో పోదు
న్యూయార్క్ ,లండన్ లలో కరెంట్ పోవచ్చు కానీ హైదరాబాద్ లో మాత్రం కరెంట్ పోదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ పనులకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభాస్థలికి చేరుకుని ప్రసంగించారు 6,250 కోట్లతో మెట్రో రైల్ ప్రాజెక్టు కు శంఖుస్థాపన చేయడం సంతోషంగా ఉందని అన్నారు. చెన్నై కంటే అనేక ఇతర నగరాల కంటే ముందే హైదారాబాద్ కి కరెంట్ వచ్చిందని అన్నారు. అద్భుతమైన విశ్వనగరంగా హైదరబాద్ ఉందని పేర్కొన్నారు. వందకు వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ, GMR, HMDA నిధులతోనే ఈ మెట్రో నిర్మాణం జరుగుతుందని అన్నారు. సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎంతో బాధ పడ్దామని అన్నారు మంచినీటి, కరెంట్ బాధలు చూసాము, అనుభవించామమని తెలిపారు.
మాండుస్ ఎఫెక్ట్.. విద్యా సంస్థలకు సెలవు..
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండుస్ తుఫాన్ ప్రభావం వల్ల నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు మొదలయ్యాయి. తుఫాను తీరం దాటిన తర్వాత రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను తీరం దాటేటప్పుడు 60 నుంచి 70 కి.మీరా వేగంతో గాలులు వేసే అవకాశం ఉందని… తీర ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు .నెల్లూరులో మాండూస్ తుఫాన్ ప్రభావం పై మా ప్రతినిధి అమర్ నాథ్ మరిన్ని వివరాలు అందిస్తారు.
తిరుపతిలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలపై మాండస్ తుఫాన్ ప్రభావంతో.. భారీ వర్షాలు జిల్లాలను ముంచెత్తనున్నాయి. తుఫాను ప్రభావంపై తిరుపతి జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. అధికార యంత్రాంగంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డి మత్సకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు. ముంపు ప్రాంత బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తిరుపతి నగరపాలక కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ 0877 2256766 ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నేటి మధ్యాహ్నం పాఠశాలలు, కళా శాలలకు సెలవు ప్రకటించారు చిత్తూరు జిల్లా కలెక్టర్. మాండూస్ తుఫాను నేపథ్యంలో నేటి మధ్యాహ్నం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ప్రకటన చేశారు.
ఆ వార్తల్లో నిజం లేదు.. అది నా బాధ్యత
నేషనల్ క్రష్ రష్మిక మందన్న వివాదంలో చిక్కకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమె ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. విద్యార్థిగా ఉన్నప్పుడు తాను ఓ అందాల పోటీలో పాల్గొన్నానని, దీంతో తన ఫోటో పేపర్లో రావడంతో అది చూసి ఓ నిర్మాణ సంస్థ తనకు హీరోయిన్‌గా అవకాశం కల్పించిందని ఆమె వెల్లడించారు. అయితే, తనకు మొదటి అవకాశాన్ని ఇచ్చిన పరంవా నిర్మాణ సంస్థ పేరు చెప్పడానికి ఆమె ఏమాత్రం ఆసక్తి చూపించలేదంటూ పలువురు కన్నడిగులు రష్మిక మండిపడుతున్నారు. అయితే.. రష్మిక నటించిన కిర్ పార్టీ సినిమాకు ‘కాంతార’ ఫేం రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. అయితే.. వీరిద్దరి మధ్య బేధాభిప్రాయలు వచ్చాయని, ఈ కారణంతోనే ఎంతోమంది ప్రముఖులు ‘కాంతార’ను ప్రశంసించినా రష్మిక ఏం మాట్లాడలేదంటూ విమర్శలు చేస్తున్నారు. కృతజ్ఞతాభావంలేని ఆమెను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో చర్చకు తెరలేపడంతో మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే.. తాజాగా దీనిపై రష్మిక స్పందిస్తూ.. కన్నడ చలన చిత్ర పరిశ్రమ తనపై నిషేధం విధించిందన్న వార్తల్లో ఎటాంటి నిజం లేదని, ఆ వార్తల్ని ఖండిస్తూ తనపై ఎలాంటి నిషేధం విధించలేదని స్పష్టం చేశారు రష్మిక. “‘కాంతార’ సినిమా విషయంలో నాపై కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ చిత్రం చూశాక బృందానికి నేను మెసేజ్ పెట్టా. నటీనటుల మధ్య ఏం జరుగుతుందో బయటివారికి తెలియదు. నా వ్యక్తిగత విషయాలను కెమెరా పెట్టి ప్రపంచానికి చూపించలేను. మెసేజ్‌లు కూడా బయటకు రిలీజ్ చేయలేను. నా వ్యక్తిగత జీవితం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వృత్తిపరంగా నేను ఏం చేస్తున్నానో అది ప్రేక్షకులకు చెప్పడం నా బాధ్యత” అని రష్మిక స్పష్టం చేశారు.
ఇక పై శ్వాస తీసుకోవటం ఆపేయమంటారా : పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస్ యాత్ర చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ బస్ యాత్ర గత దసరాకు ప్రారంభం కావాల్సి ఉండగా.. కొన్ని రోజులు వాయిదా పడింది. అయితే.. పవన్ కల్యాణ్ నిర్వహించ తలపెట్టని బస్ యాత్ర వాహనం ఇటీవల రెడీ కావడంతో ట్రయల్ రన్ చేసి దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పవన్. ‘వారాహి’ ఈజ్ రెడీ ఫర్ బ్యాటిల్ అంటూ నెట్టింట పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటోలు తెగ వైరల్‌గా మారాయి. అయితే.. జనసేనాని పవన్ కళ్యాణ్ తన ఎలక్షన్ బ్యాటిల్ కోసం రెడీ చేసుకున్న వారాహి వాహనం కలర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. వారాహి రంగు మిలటరీ రంగును పోలి ఉండటంతో వివాదం చెలరేగింది. దీన్నే టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. నింబంధనలకు విరుద్ధంగా రంగులు వేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. కనీసం ఆలివ్ గ్రీన్ చొక్కా అయినా వేసుకోవచ్చా అంటూ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా తన సినిమాలను అడ్డకున్నారని.. ఆపై విశాఖ పర్యటనకు వెళ్తే హోటల్ గది నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. బలవంతంగా తనను విశాఖ నగరం నుంచి పంపించి వేశారని పవన్ పేర్కొన్నారు. మంగళగిరిలో సైతం తను కారులో వెళ్తుంటే అడ్డుకున్నారన్నారు. ఇప్పటం గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్న తనను ఆపేశారన్నారు. ఇప్పుడు వాహనం రంగు పైనా వివాదం చేస్తున్నారన్నారు. ఇక పై శ్వాస తీసుకోవటం ఆపేయమంటారా అని పవన్ ఫైర్ అయ్యారు పవన్ కల్యాణ్.
బోల్తాపడిన వోల్వో బస్సు..
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున బెంగళూరు వెళ్తున్న వోల్వో బస్సు బోల్తా పడడంతో ప్రయాణికులు అద్భుతంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని పరిశీలించేందుకు అటుగా వెళ్తున్న కారును ఆపి వెనుక నుంచి డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రయాణికుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
12వ రోజుకు చేరిన బండిసంజయ్ పాదయాత్ర..
జగిత్యాల జిల్లాలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర 12వ రోజుకు చేరుకుంది. కోరుట్ల నియోజకవర్గంలోని వేంపేట గ్రామ శివారులోని రాత్రి శిబిరం నుంచి ప్రారంభం కానున్న బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుంది. మెట్ పల్లి,ఆరాపేట్, చెవుల మద్ది క్రాస్ రోడ్స్, చింతలపేట మీదుగా యూసుఫ్ నగర్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఇవాళ 3.6 కిలోమీటర్ల మేర ప్రజా సంగ్రామ యాత్ర జరగనుంది. యూసుఫ్ నగర్ లో బండి సంజయ్ రాత్రి బస చేయనున్నారు.
ఈసారి ఎన్నికల్లో సెంటిమెంట్ వర్కౌట్ కాదు : ఈటల
ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ సంచరాలు జరుగుతున్న వేళ బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు ఈటల రాజేందర్ సంచళన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో సెంటిమెంట్ వర్కౌట్ కాదని ఎద్దేవ చేశారు. నల్లగొండ నియోజకవర్గంలో ప్రజాగోస – బీజేపీ భరోసాయాత్ర బైక్ ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ శ్రేణులు ఈటెల రాజేందర్ కి ఘన స్వాగతం పలికారు. పానగల్లు లోని పచ్చల సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈటెల. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధగోని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజా గోస బీజేపీ భరోసా యాత్రలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించే బైక్ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఏర్పాటుతో కెసిఆర్ కు తెలంగాణ ప్రజానీకానికి బంధం తెగిపోయిందని అన్నారు.
ఆరెండూ రావాలంటే అదృష్టం ఉండాలి: కేతిక శర్మ
ఈ మధ్య కాలంలో తెలుగు తెరకు పరిచయమైన అందమైన హీరోయిన్లలో కేతిక ఒకరు. పూరీ జగన్నాథ్ బ్యానర్ నుంచి హీరోయిన్ వస్తే.. పూరీ మెచ్చిన అందం తప్పదని అందరూ అనుకుంటున్నారు. ఊహించినట్లుగానే ఈ బ్యూటీఫుల్ ‘రొమాంటిక్’ సినిమా ఫస్ట్ పోస్టర్ తోనే కుర్రాడి మనసు ఉలిక్కిపడేలా చేసింది. తన అభిమానుల జాబితాలో చేరిపోయారు. గుమ్మడి పువ్వులా ఉన్న కేతికను చూడగానే కుర్రాళ్లు చలించిపోయారు. గ్లామర్ పరంగా .. నటన పరంగా కృతి శెట్టి , శ్రీలలతోపాటు తన జోరును చూపించడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ.. కథ అడ్డం తిరిగింది. గ్లామర్ పరంగా సినిమాలకు 100% మార్కులు వచ్చినా కథల పరంగా మాత్రం ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఈ ముద్దుగుమ్మ కాస్త వెనుకబడింది. ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. అవకాశం రావాలి.. దాని వెనుక విజయం కూడా రావాలి అంటుంది. ఈ రెండూ రావాలంటే చాలు అదృష్టం ఉండాలి. తనకు దక్కని అదృష్టాన్ని చేజిక్కించుకోవాలనే తపనతో ఆమె ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే తన లేటెస్ట్ పిక్స్ రిలీజ్ చేస్తోంది. కేతిక అందాల గని అనడంలో సందేహం లేదు. లేకుంటే ఒక్క దెబ్బతో లక్ష్యాన్ని చేధిస్తే లైన్లో పడుతుందేమో చూడాలి మరి! అదృష్టం దక్కేనా కేతికా అంటూ కొందరు కామెంట్లు చేస్తారు. మరి కేతికకకు అదృష్టం వరిస్తుందో లేదో తెలియదు కానీ.. తన అందాలతో సోషల్ మీడియాను మాత్రం షేక్ చేస్తోంది ఈ అమ్మడు. మరి ఈపోజులకైనా ఏడైరెక్టరైనా కేతికపై దయ చూపేనా?
అఫ్తాబ్ జ్యూడీషియల్ కస్టడీ పొడిగింపు
తన జీవిత భాగస్వామిని హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ పూనావాలా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని సాకేత్ కోర్టు శుక్రవారం మరో 14 రోజులు పొడిగించింది. అతన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. అతన్ని వ్యక్తిగతంగా హాజరుపరచాల్సి ఉంది, అయితే భద్రతా కారణాల దృష్ట్యా నిర్ణయం మార్చుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మే 18న శ్రద్దను చంపినందుకు అభియోగాలు మోపబడి ప్రస్తుతం అతను తీహార్ జైలులో ఉన్నాడు. నివేదికల ప్రకారం, నిందితుడిని సాకేత్ కోర్టులో సంబంధిత జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నందున తీహార్ జైలు అథారిటీ తన 3వ బెటాలియన్‌కు ప్రత్యేక భద్రత కల్పించాలని ఆదేశించింది.
వంట నూనెతో ఎగిరే విమానం
విమానాలు సాధారణంగా శుద్ధమైన ప్రత్యేక పెట్రోల్‌తో నడుస్తాయి. దీనిని విమాన ఇంధనమని పిలుస్తారు. ఉక్రెయిన్-రష్యా యుద్దం కారణంగా ధరలు భారీగా పెరగడంతో వంట నూనెల పేరు వింటేనే జనం జంకే పరిస్థితి. వంట నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. విమానయాన రంగంలో సంచలన మలుపుగా వంట నూనెతో నడిచిన విమానం ఆకాశంలోకి ఎగురుతోంది. ఈ ఘనతను బ్రిటన్ రాయల్ ఎయిర్‌ఫోర్స్ సాధించింది. సైనిక రవాణా విమానాన్ని నూరుశాతం సుస్థిర విమాన ఇంధనం (ఎస్‌ఏఎఫ్) సాయంతోనే నడిపించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇలా ప్రయాణించిన విమానాల్లో ప్రపంచంలో ఇదే మొట్టమొదటిది కావడం గమనార్హం. సైనిక, పౌర విమాన సేవలకు ఎస్‌ఏఎఫ్‌ను వాడుకోవటానికిది మార్గం సుగమం చేసింది.
ఇంగ్లండ్ ఆటగాళ్లకు భద్రత పెంపు
17 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఆ గడ్డపై టెస్టు సిరీస్ ఆడడానికి వచ్చిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో అద్భుత విజయం సాధించి రెండో టెస్టుకు సన్నద్ధం అవుతున్న సమయంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ముల్తాన్‌లో ఆ జట్టు ఆటగాళ్లు బస చేసిన హోటల్‌కు సమీపంలో కాల్పులు చోటు చేసుకోవడం ఇందుకు కారణమైంది. క్రికెటర్లు ఉన్న హోటల్‌కు కిలోమీటర్ దూరంలో గురువారం ఉదయం తుపాకీ కాల్పుల శబ్ధాలు వినిపించాయి. గురువారం ఉదయం ఇంగ్లాండ్ ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్ కోసం రెడీ అవుతోన్న సమయంలో ఈ కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఇటీవలే పాక్ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ అయిన ఇమ్రాన్ ఖాన్‌పై దుండగుడు కాల్పులు జరిపి గాయపరిచిన నేపథ్యంలో తాజా ఘటనతో ఆందోళన రెట్టింపైంది.
18 ఏళ్లకే మేయర్.. చరిత్ర సృష్టించాడు..
ఓ 18 ఏళ్ల కుర్రాడు కొత్త చరిత్ర సృష్టించాడు.. అమెరికాలో అతి పిన్న వయస్కుడైన మేయర్‌గా చరిత్రకెక్కాడు.. యూఎస్‌లోని అర్కాన్సాస్‌లోని ఒక చిన్న పట్టణంలో తన ప్రత్యర్థిని ఓడించి మేయర్‌గా ఎన్నికయ్యాడు 18 ఏళ్ల జైలెన్ స్మిత్.. యునైటెడ్ స్టేట్స్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన మేయర్‌గా రికార్డు సృష్టించాడు.. స్థానిక మీడియా ప్రకారం, అతను తన ప్రత్యర్థి మాథ్యూస్‌పై 185 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు.. జైలెన్ స్మిత్ ఈ సంవత్సరం ప్రారంభంలో ఉన్నత పాఠశాల నుండి పట్టభద్రుడయ్యాడు. 2020 జనాభా లెక్కల ప్రకారం, తూర్పు అర్కాన్సాస్‌లో, మిస్సిస్సిప్పి నదికి పశ్చిమాన 30 మైళ్ల దూరంలో ఉన్న ఎర్లే పట్టణం మరియు టెన్నెస్సీలోని మెంఫిస్, 1,831 జనాభాను కలిగి ఉంది. అతను తన ఫేస్‌బుక్ పేజీలో తన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపాడు
మళ్లీ విశాఖ నుంచే పోటీ..
గత సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి జనసేన తరఫున బరిలోకి దిగిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ.. ఓటమిపాలయ్యారు.. ఆ తర్వాత కొంతకాలం.. రాజకీయాల్లో యాక్టివ్‌గా కనిపించినా.. ఆ తర్వాత దూరం అయ్యారు.. అయితే, మరోసారి ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతున్నట్టు ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.. విశాఖ నుంచే మరోసారి పార్లమెంట్‌కు పోటీ చేస్తానని ఆయన మీడియా చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చారు.. మన వ్యవస్థలో స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం కూడా ఉందని గుర్తుచేసిన ఆయన.. నేను ఏపార్టీ నుంచి పోటీ చేస్తానో.. సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారం జరుగుతుందన్నారు.. అయితే, నా భావాలకు అనుగుణంగా ఉన్న పార్టీ వైపే ఉంటానని స్పష్టం చేశారు.. గత ఎన్నికల్లోనే బాండ్ పేపర్ రాశాను.. తాను అనుకున్నది చేయలేకపోతే క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పానని గుర్తుచేసుకున్నారు లక్ష్మీనారాయణ.
చిక్కుల్లో ఎలాన్ మస్క్
టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు కొత్త చిక్కులు వచ్చిపడేలా ఉన్నాయి.. ట్విట్టర్‌తో డీల్ కుదుర్చుకుని వెనక్కి తగ్గిన ఆయనపై లీగల్‌గా ముందుకు వెళ్లింది ఆ సంస్థ.. కోర్టు ఆదేశాలను చివరకు ఆయన దిగివచ్చి ట్విట్టర్‌ను తీసుకోవాల్సి వచ్చింది.. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మరోసారి ఆయనకు న్యాయపరమైన ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి.. ఎందుకంటే.. ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత.. కీలక మార్పులు చేస్తూ వచ్చారు మస్క్.. ఆ సోషల్ మీడియా సైట్‌లో పనిచేస్తున్న సుమారు 7500 మంది ఉద్యోగులను తొలగించారు.. అయితే, తొలగింపులను ప్రశ్నిస్తూ మాజీ ఉద్యోగులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఆఫీసు రూమ్‌లను బెడ్‌రూమ్‌లుగా మారుస్తున్నట్లుగా కూడా మస్క్‌పై శాన్ ఫ్రాన్సిస్‌కోలో కేసు నమోదు అయ్యింది. ముందుగా మస్క్ హామీ ఇచ్చినట్లు తమకు నష్టపరిహారం అందడం లేదని మరికొందరు మాజీ ఉద్యోగులు ఫిర్యాదులు చేశారు.. 60 రోజుల వార్నింగ్ టైమ్ కూడా ఇవ్వకుండానే తమను తొలగించినట్లు కొందరు కేసులు బుక్ చేశారు. ఇవే ఎలాన్ మస్క్‌కు కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టేలా కనిపిస్తున్నాయి..