కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పట్టణంలో హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్, జిల్లా బీజేపీ ఇంఛార్జి ప్రభాకర్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్ కి తెలంగాణ నినాదంతో బంధాలు తెగిపోయాయన్నారు. తెలంగాణ మట్టి బిడ్డలుగా ఈ అహంకార పాలన అంతం చేయడమే మన ఎజెండా అని ఆయన వ్యాఖ్యానించారు. నాకు చేసిన అవమానాలు అన్నీ వడ్డీతో సహా చెల్లించే రోజు వస్తుంది కేసీఆర్ అని ఆయన అన్నారు. సంస్కార లేనివాళ్ళు, గతాన్ని మర్చిపోయిన వాళ్ళు, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన వారు చిల్లరగా వ్యవహరించారన్నారు. కేసీఆర్ పక్కన తెలంగాణ ద్రోహులు ఉన్నారని, తెలంగాణ పేరు ఎత్తడానికి సిగ్గుపడుతున్నారన్నారు. అందుకే టీఆర్‌ఎస్ పోయి బీఆర్ ఎస్ వచ్చిందని ఆయన అన్నారు. నన్ను కాపాడుకుంటే ప్రజలు కాపాడుతారు.
Also Read : Fifa World Cup: ఫిఫా ప్రపంచకప్ విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
పోలీసులు కాదు అని ఆయన అన్నారు. ఈటల వచ్చింది మోరీల కోసం కాదు కేసీఆర్‌ను బొంద పెట్టీ, ఈ గడ్డ మీద బీజేపీ జెండా ఎగురవేయడానికి అని ఆయన అన్నారు. తెలంగాణ నీ అబ్బ జాగీరు కాదు కేసీఆర్ అంటూ ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. బీజేపీకి భారత్ మాతాకీ జై అనే నినాదం ఎలాగో.. తెలంగాణలో జై తెలంగాణ కూడా అంతే ముఖ్యమని అన్నారు. మానుకొటలో తెలంగాణ ఉద్యమ కారుల మీద రాళ్ళు వేసి.. మా రక్తాన్ని చూసిన వారు కేసీఆర్ చంకన చేరారని ఆరోపించారు. బొమ్మల గుడి దగ్గర అన్నదాన కార్యక్రమంలో.. సంస్కార లేనివాళ్ళు.. గతాన్ని మర్చిపోయిన వాళ్ళు.. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన వారు.. చిల్లరగా వ్యవహరించారని మండిపడ్డారు.