టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మరోసారి ఈటెల రాజేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇళ్ళంతకుంట నాయకుల కోసం 5 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చారని..భారీ స్థాయిలో కొనుగోళ్లు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు కెసిఆర్ డబ్బుని నమ్ముకున్నాడని… స్కూల్ ను… బార్ గా మార్చి కమలపూర్ వాళ్ళందరిని ప్రలోభాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేట తీసుకు పోయి డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారని… దళిత బంధు హుజురాబాద్ ఎన్నిక కోసమేనన్నారు. ప్రాణం వుండగానే తనను బొంద బెట్టాలని చూసిన… కెసిఆర్ కి మళ్లీ ఓటు వేస్తమా? అని తెలిపారు. 100 శాతం ఓట్లు వేస్తామని హామీ ఇచ్చిన గ్రామ ప్రజలకు రుణ పడి ఉంటానని పేర్కొన్నారు.