దళిత బంధు నిలుపుదలతో హుజూరాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపి పార్టీల మధ్య వివాదం రాజుకుంది. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల మధ్య పోటా పోటీగా దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు. పోటా పోటీగా నినాదాలుతో పొలిటికల్ హిట్ తారాస్థాయికి చేరింది. పలుచోట్ల దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈటెల దళిత బంధు ఆపడానికి కుట్ర పన్నాడని దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఇక జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామంలో ఏకంగా ఈటల రాజేందర్ దిష్టి బొమ్మ శవయాత్ర నిర్వహించారు. మాచనపల్లి గ్రామంలో TRS పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ దిష్టి బొమ్మ శవయాత్ర నిర్వహించారు. దళిత వాడలల్లో ఇంటి ఇంటికి తిరుగుతూ దళిత ద్రోహి ఈటల రాజేందర్ అంటూ నినాదాలు చేశారు టీఆర్‌ఎస్ నేతలు. దళిత బంధు ఆపాలని ఎలక్షన్ కమిషనకు చేసిన ఫిర్యాదు వెనకకు తీసుకోవాలని… దళితులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నేతలు.